AP News.. ఏపీలో అరాచక పాలన: మాజీ ఎమ్మెల్సీ మాధవ్
ABN , First Publish Date - 2023-04-29T11:01:21+05:30 IST
విశాఖ: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ( Ex. MLC Madhav) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విశాఖ: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ( Ex. MLC Madhav) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్.. వైఎస్సార్ వ్యూ పాయింట్ (YSR View Point)గా మార్చడం సరికాదన్నారు. తక్షణమే వారం రోజుల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని.. లేదంటే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వీధి పేర్లు కూడా వైఎస్సార్ పేర్లు పెడతారెమోనని ఆయన ఎద్దేవా చేశారు.
సింహాచలం చందనోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మాధవ్ విమర్శించారు. కొండ మీదే సీఎం జగన్ డౌన్ డౌన్ అన్నారంటే... చందనోత్సవం ఏ విధంగా నిర్వహించారనేది అర్థం అవుతోందన్నారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీశారని.. భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.
కాగా వైజాగ్ బీచ్ రోడ్డులోని జోడుగుళ్లపాలెం వద్ద సీతకొండ ప్రాంతమంటే నగరవాసులతో పాటు పర్యాటకులకూ ఇట్టే తెలిసిపోతుంది. అందరికీ పరిచయమైన ఈ ప్రాంతం పేరు ఇప్పుడు మారిపోయింది. అక్కడ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెద్ద పెద్ద అక్షరాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.