Gudivada Amarnath: సింపథీ కోసమే బాబు ఆరోగ్య సమస్యలు తెరపైకి తెస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-11T14:09:12+05:30 IST

చంద్రబాబు (Chandrababu) ఉన్నది వెల్‌నెస్ సెంటర్‌లో కాదు.. జైల్లో ఉన్నారు. నేరం చేసిన వాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా.. దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.

Gudivada Amarnath: సింపథీ కోసమే బాబు ఆరోగ్య సమస్యలు తెరపైకి తెస్తున్నారు

విశాఖ: దొంగతనం చేసిన వాళ్లంతా ఒక్కసారితో నిజం చెప్పరని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అన్నారు. గుడివాడ గుర్నాథరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్, వైసీపీ నేతలు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. ‘‘చంద్రబాబు (Chandrababu) ఉన్నది వెల్‌నెస్ సెంటర్‌లో కాదు.. జైల్లో ఉన్నారు. నేరం చేసిన వాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా.. దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం సింపథీ కోసం చేసే ప్రయత్నం. సీఐడీ విచారణ తర్వాత లోకేష్ (Nara Lokesh) సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నారు. దొంగతనం చేసిన వాళ్లు ఒక్కసారితో నిజం చెప్పరు. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయి.. అంతేకానీ లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదు. హెరిటేజ్ కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేసినప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టారో చెప్పాలి. మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు. లోకేష్ తప్పుకి శిక్షపడ్డం ఖాయం. కోర్టు కూడా నమ్మింది కాబట్టే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు.’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-11T14:09:12+05:30 IST

News Hub