AP Minister: వాలంటీర్లు దైవంశ సంభూతులు.. పవన్ కళ్ళు ఉన్న కబోది అన్న ఏపీ మంత్రి
ABN , First Publish Date - 2023-07-14T13:02:36+05:30 IST
వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. వాలంటీర్లు దైవంశ సంభూతులు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
విశాఖపట్నం: వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. వాలంటీర్లు దైవంశ సంభూతులు అని మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కళ్ళు ఉన్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్‌లో అన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని.. కాస్మొటిక్ చార్జీలు పెండింగ్ ఏమీ లేవని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెరుగుతుంటాయి.. తగ్గుతుంటాయన్నారు. పార్టీ నుంచి కొంతమంది వెళ్తుంటారు.. వస్తుంటారని... పంచకర్ల రమేష్ ఎందుకు వెళ్లారో తెలీదన్నారు. క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినా వాటి మీద హక్కు లేదని.. వారికి హక్కులు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దళితుల కోసం స్మశాన స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.