Former Vice President: ‘నవయుగ వైతాళికుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

ABN , First Publish Date - 2023-01-20T11:35:58+05:30 IST

నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు.

Former Vice President: ‘నవయుగ వైతాళికుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

విశాఖపట్నం: నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu ) శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపిన వ్యక్తి కందుకూరి అని... ఆయన కార్య వీర సూరుడు అని కొనియాడారు. సాధారణ తెలుగు పండితుడు... అసాధారణ కార్యాలు చేసిన వ్యక్తి అని అన్నారు. సాహిత్యం ప్రజల హితం కోరాలని... కందుకూరి జీవితాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలని సూచించారు. 19 వ శతాబ్దం చివరిలో సామాజిక చైతన్య తీసుకొచ్చిన వ్యక్తి కందుకూరి అని అన్నారు. సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించారని... స్త్రీ విద్య కు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. తెలుగు భాషను వాడుక భాషగా మార్చారని చెప్పుకొచ్చారు. సంక్లిష్ట భాషవాడకుండా సులువుగా అర్ధమయ్యే రీతిలో రచన చేశారన్నారు. ‘‘నా పదవి కాలం ముగిసినప్పటికీ... ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావాలని కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు’’ వెల్లడించారు. బ్రిటిష్ వారు ఒక పాడు అలవాటుచేశారని.. పూర్తి పేరుతో పిలిచే అలవాటు తీసేశారని మండిపడ్డారు. పుస్తకాన్ని రచించిన ఆచార్య సిమ్మన్నను వెంకయ్యనాయుడు అభినందించారు.

Updated Date - 2023-01-20T11:42:34+05:30 IST