Grandhi Srinivas: భీమవరం సభపై పవన్ ప్రసంగం తుస్సుమనిపించారు

ABN , First Publish Date - 2023-07-01T12:52:30+05:30 IST

భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.

Grandhi Srinivas: భీమవరం సభపై పవన్ ప్రసంగం తుస్సుమనిపించారు

పశ్చిమగోదావరి: భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Bhimavam MLA Grandhi Srinivas) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన అంటే ప్యాకేజీ పార్టీ అని.. అబద్దాల పార్టీ అని అన్నారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్‌గా భావిస్తారన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. పవన్ తనని తాను ఎందుకు మోసం చేసుకుంటారని ప్రశ్నించారు. మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధపడ్డాయన్నారు. తమరు చేసిన దాష్టీకాలు భరించలేక ప్రజలు ఓడించారని ఎమ్మెల్యే తెలిపారు.

2019లో విడివిడిగా పోటీ చేసామంటూ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. పవన్ ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారన్నారు. ‘‘నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ మాట్లాడారు.. నాకు మీరంతా ఓట్లు వేయలేదంటూ సొంత పార్టీ వాళ్ళను అవమానిస్తున్నారు.. మహనీయుల పేర్లు పలుకుతూ వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారు.. పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ పేరు చెబుతూ ఒంటరిగా వెళ్లి ఆత్మార్పణ చేయాల్సిన పని లేదంటారు.. చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మద్యపాన నిషేధం సాధ్యం కాదంటున్నారు.. చంద్రబాబులో భగత్‌సింగ్, పొట్టి శ్రీరాములు, చేగువేరా కనిపిస్తున్నారేమో పవన్ కళ్యాణ్ చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు. భీమవరం వచ్చి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడిన పవన్ అంతకుముందు 10యేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారిని ప్రశ్నించలేదన్నారు. డంపింగ్ యార్డ్ కోసం రహస్యంగా కార్యాచరణ చేస్తున్నామని... లేదంటే కోర్టులో అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వెల్లడించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-01T13:13:13+05:30 IST

News Hub