Chintamaneni: జగన్ భవిష్యత్తు లేకుండా చేశారు
ABN , First Publish Date - 2023-01-31T22:32:26+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు విమర్శలు చేశారు.
ద్వారాక తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Cm JaganMohan Reddy), వైసీపీ ప్రభుత్వం (YCP GOVT)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Former MLA Chintamaneni Prabhakar) ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ నాయకులపై జగన్ అక్రమ కేసులు పెడుతున్నాడన్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ 37 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాబోయే తరాలకు భవిష్యత్తు లేకుండా చేశారనీ, అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు కరెంటు చార్జీలు, 3 ఆర్టీసీ పెంచారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితికి తీసుకువచ్చారని చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా ద్వారాక తిరుమల మండలం వెంపాడు గ్రామ పంచాయతీలో గోపాలపురం టీడీపీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో 'ఇదేం కర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొన్నారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు, పెరిగిన విద్యుత్ చార్జీలు, రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు వివరించారు.