Credit cards: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం.. ఒక్క నెలలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-07-16T17:31:14+05:30 IST

దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.

Credit cards: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం.. ఒక్క నెలలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే..

దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో క్రెడిట్ కార్డులు వినియోగించలేదు. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా చెప్పవచ్చు. గతంలో ఒక నెలలో రూ.1.1 నుంచి 1.2 లక్షల కోట్ల మధ్యనే క్రెడిట్ కార్డుల వ్యయం ఉండేది. కానీ అది ఈ సారి ఏకంగా రూ.1.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో నెలకు 5 శాతం చొప్పున క్రెడిట్ కార్డుల వ్యయం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 87.4 మిలియన్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఈ జనవరి తర్వాత మన దేశంలో 5 మిలియన్ల క్రెడిట్ కార్డులు పెరిగాయి. జనవరిలో క్రెడిట్ కార్డుల సంఖ్య 82.4 మిలియన్లుగా ఉండగా.. క్రమంగా పెరుగుతూ ఫిబ్రవరిలో 83.3 మిలియన్లు, మార్చిలో 85.3 మిలియన్లు, ఏప్రిల్‌లో 86.5 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదట రెండు నెలల్లోనే 2 మిలియన్ల క్రెడిట్ కార్డులు పెరిగాయి.


ఇక సగటును ఒక్కో క్రెడిట్ కార్డుపై రూ.16,144 ఖర్చు చేస్తున్నారు. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీకి(HDFC) చెందిన 18.12 మిలియన్ల క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. మొత్తం క్రెడిట్ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ వాటానే 28.5 శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్బీఐకి (SBI Card) చెందిన 17.13 మిలియన్ల క్రెడిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంకుకు(ICICI Bank) చెందిన 14.67 మిలియన్ల క్రెడిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంకుకు(Axis Bank) చెందిన 12.46 మిలియన్ల క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. 90 రోజుల పాటు చెల్లించని క్రెడిట్ కార్డ్‌ల మొండి బకాయిలు 2.94 శాతంగా ఉన్నాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 0.66 శాతం పెరిగింది. అదే సమయంలో వ్యక్తిగత రుణాలు 0.04 శాతం నుంచి 0.94 శాతానికి పెరిగాయి. మార్చి 2023 నాటికి క్రెడిట్ కార్డ్‌లపై ఉన్న బకాయిలు 34 శాతం పెరిగాయి. వ్యక్తిగత రుణాలు 29 శాతం పెరిగాయి.

Updated Date - 2023-07-16T17:36:28+05:30 IST