Kodanadu Estate: కొడనాడు ఎస్టేట్ కేసు విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-06-25T13:10:48+05:30 IST
కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate)లో జరిగిన దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసు విచారణను ఊటీ జిల్లా కోర్టు మరోమారు వాయిదా
అడయార్(చెన్నై): కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate)లో జరిగిన దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసు విచారణను ఊటీ జిల్లా కోర్టు మరోమారు వాయిదా వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులందరినీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను న్యాయమూర్తి వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేశారు. నీలగిరి జిల్లాలోని కొడనాడులో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత(Jayalalitha), ఆమె ప్రియ నెచ్చెలి శశికళ(Shadhikala)కు చెందిన తేయాకు ఎస్టేట్ ఉండేది. ఇక్కడ 2017 ఏప్రిల్ 23వ తేదీన అర్ధరాత్రి 11 మంది ముఠా సెక్యూరిటీ గార్డును హత్య చేసి, ఎస్టేట్‌లో దోపిడీ చేశారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అయిన కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అలాగే, ఈ దోపిడీ, హత్య కేసుతో సంబంధం ఉన్న వారిలో 10 మందిని అరెస్టు చేశారు. నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ ఊటీ జిల్లా కోర్టులో సాగుతోంది. అయితే, ఈ కేసు విచారణ మొదటి నుంచి సాగుతుండగా, శుక్రవారం మరోమారు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణను వచ్చే నెల 28వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.