Share News

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

ABN , First Publish Date - 2023-11-14T21:37:31+05:30 IST

పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

న్యూఢిల్లీ: పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.


పార్టీలో అనేక మంది సమర్ధులైన సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఆప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారంటూ నిత్యానందర్ రాయ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనికి లాలూ మంగళవారంనాడు ఇస్కాన్ ఆలయం నిర్వహించిన గోవర్ధన్ పూజ కార్యక్రమంలో కౌంటర్ ఇచ్చారు. నేను నా భార్యను కాకుండా ఆయన భార్యను సీఎం చేస్తానా? అంటూ లాలూ ఛలోక్తి విసిరారు. కేంద్ర మంత్రి బీజేపీలో చేరకముందు ఆర్జేడీ చేరుతానంటూ తనను సంప్రదించినట్టు కూడా ఆయన చెప్పారు.


''మా పార్టీలోకి ఆయన రావాలనుకున్నారు. బీజేపీ ఆయనను యాదవుల సీఎంగా చేస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. రబ్రీ దేవిని లాలూ సీఎంగా చేశారు కదా అని ఆయన వారికి సమాధానమిచ్చారు. అయితే... నేను రబ్రీదేవిని సీఎం చేయకపోతే ఆయన భార్యను (కేంద్రమంత్రి) సీఎం చేస్తానా? రబ్రీదేవే లేకుంటే ఆర్జేడీ, మన ప్రభుత్వం ఈరోజు బీహార్‌లో ఉండేదే కాదు. ఆమె సీఎం పదవి నిర్వహించకపోయి ఉంటే నితీష్-తేజస్వి ప్రభుత్వం బీహార్‌లో ఏర్పడదే కాదు'' అని లాలూ వివరించారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడున్నా యాదవులను విడగొడుతుంటారని, తాము అలా జరగనీయమని చెప్పారు. బలహీనులను, తమ ప్రభుత్వాన్ని కృష్ణ భగవానుడు రక్షిస్తుంటాడని అన్నారు. తమ ప్రభుత్వం 75 శాంత రిజర్వేషన్ ఇచ్చిందని, లక్షలాది మందిని టీచర్లను చేసిందని, ప్రజలకు సాధికారత కల్పించామని అన్నారు. ''మా ప్రభుత్వం రాకముందు మీరు ఓటు ఎక్కడ వేయనిచ్చారు?. బలవంతంగా బూత్‌లను స్వాధీనం చేసుకునేవారు'' అంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-11-14T21:39:07+05:30 IST