Farooq Abdullah: మనకూ గాజా, పాలస్తీనా గతే... సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:32 PM
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యా్ఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపకపోవడంపై నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రాన్ని విమర్శించారు. ఎందుకు పాక్‌తో మనం చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (National conference) ఎంపీ ఫరూక్ అబ్దుల్లా (Farooq abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపకపోవడంపై నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రాన్ని విమర్శించారు. ఎందుకు పాక్‌తో మనం చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు.
''మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమని అటల్ బిహారీ వాజ్‌పేయి తరచు చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంతో ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోదీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ? నవాజ్ షరీప్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా చర్చలకు (ఇండియాతో) సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు'' అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.