Eating Eggs: గుడ్లు తింటే కొవ్వు పెరుగుతుందా..? గుండెకు మంచిది కాదా..? ఇది చదివాక తినాలో, వద్దో మీరే డిసైడ్ అవ్వండి..!
ABN , First Publish Date - 2023-02-20T12:25:31+05:30 IST
గుడ్డు అనేది పూర్తి పోషకాహారమని మనం భావిస్తాం. అయితే ఇది గుండెకు మంచిదని మాత్రం మనం అస్సలు అనుకోము. మన నమ్మకం ఏంటంటే.. గుడ్డు అనేది కొలెస్ట్రాల్‌తో కూడుకున్న ఫుడ్. కాబట్టి దీనిని లిమిట్‌గా మాత్రమే తీసుకోవాలి. అసలు దీన్ని వాడకుంటే మరీ ఉత్తమం అని ఫీలవుతుంటాం. కానీ..
Eating Eggs: గుడ్డు అనేది పూర్తి పోషకాహారమని మనం భావిస్తాం. అయితే ఇది గుండెకు మంచిదని మాత్రం మనం అస్సలు అనుకోము. మన నమ్మకం ఏంటంటే.. గుడ్డు అనేది కొలెస్ట్రాల్‌తో కూడుకున్న ఫుడ్. కాబట్టి దీనిని లిమిట్‌గా మాత్రమే తీసుకోవాలి. అసలు దీన్ని వాడకుంటే మరీ ఉత్తమం అని ఫీలవుతుంటాం. కానీ ఇది ఎంత వరకూ నిజం? ఒకవేళ మనం అనుకునేదే నిజమైతే ఎగ్‌ను అవాయిడ్ చేయాల్సిందేనా? చూద్దాం.
వారానికి 5 గుడ్లు తీసుకుంటే..
బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు గుడ్డు కారణంగా బీపీ, బ్లడ్ షుగర్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ చాలా తక్కువని తేల్చారు. ఒక గుడ్డులో 78 కేలరీలు ఉంటాయి. అలాగే ఒక పెద్ద గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఎగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం ఏమాత్రం కాదని పరిశోధకులు తేల్చారు.
కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎగ్స్ తినొచ్చా?
ఎగ్ యోక్స్ (గుడ్డులోని పచ్చసొన) కొలెస్ట్రాల్‌కి స్టోర్‌హౌస్ లాంటిది. కాబట్టి కొలెస్ట్రాల్ పెద్ద మొత్తంలో ఉన్నవారు ఎగ్‌ను అవాయిడ్ చేయడం ఉత్తమం. గుడ్డులోని పచ్చసొనలో ఇతర ఫుడ్‌తో పోలిస్తే పెద్ద మొత్తంలో న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్ లేని వారు మాత్రం ఉడికించిన గుడ్లను తీసుకోవడం ఉత్తమం.
గుడ్డుతో.. చెడు కొలెస్ట్రాల్?
కొలెస్ట్రాల్ అయితే గుడ్లలో బీభత్సంగా ఉంటుందని పైనే చెప్పుకున్నాం. దీనిని పక్కనబెడితే ఎగ్‌లో విటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎగ్‌లో పెద్ద మొత్తంలో పాస్ఫరస్, కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇందులో రాగి, అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం, జింక్ కూడా ఉన్నాయి. కాబట్టి గుడ్డు తినడం వలన మనకు చాలా మేలు జరుగుతుంది.
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?
చాలా పరిశోధనలు మన బాడీకి అవసరమై న్యూట్రియంట్స్‌ను అందించేందుకు రోజుకు ఒక గుడ్డు చాలని తేల్చాయి. అయితే ముందుగా రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ఎలా తినాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. వాస్తవానికి మనం గుడ్లతో ఏం తీసుకుంటామనేది ముఖ్యం. వెన్న, చీజ్, బేకన్, సాసేజ్, మఫిన్‌లు తదితర వాటితో పాటు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. ఇవి మన శరీరంలో గుడ్డులోని కొలెస్ట్రాల్‌ను మించిన బ్లడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.