Kuwait: ప్రవాసుల వీసా రెన్యువల్.. గతేడాది కువైత్‌కు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..!

ABN , First Publish Date - 2023-04-05T08:26:33+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌‌లో (Gulf Country Kuwait) ఆ దేశ జనాభా కంటే ప్రవాసులే (Expats) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే.

Kuwait: ప్రవాసుల వీసా రెన్యువల్.. గతేడాది కువైత్‌కు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌‌లో (Gulf Country Kuwait) ఆ దేశ జనాభా కంటే ప్రవాసులే (Expats) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా వెలువడిన ఆ దేశ సెన్సస్ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం కువైత్ జనాభాలో సుమారు 65శాతం వరకు ప్రవాసులే ఉన్నారట. ఇక దేశంలో భారీ సంఖ్యలో ఉన్న వలసదారుల కారణంగా కువైత్‌కు ప్రతియేటా వివిధ మార్గాలలో భారీ ఆదాయమే సమకూరుతోంది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం 2022 ఏడాదికి సంబంధించి వలసదారులకు సంబంధించిన వీసాల రెన్యువల్ ద్వారానే ఆ దేశానికి ఏకంగా 154 మిలియన్ కువైటీ దినార్ల ఆదాయం వచ్చింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 4వేల కోట్లకు (రూ.41,26,38,81,813) పైమాటనే. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వశాఖ, మ్యాన్‌పవర్, సివిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సూరెన్స్, సెంట్ర అడ్మినిస్ట్రేషన్ ఫర్ స్టాటిస్టిక్స్ వెల్లడించాయి. ప్రధానంగా వార్షిక రెసిడెన్సీ వీసా రెన్యువల్, కొత్త రెసిడెన్సీ పొందిన వారి నుంచి అధిక భాగం ఆదాయం సమకూరినట్లు మంత్రిత్వశాఖలు పేర్కొన్నాయి.

ఇక తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం.. కువైత్ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే 1.4 మిలియన్ల మంది వలసదారులు గతేడాది వారి రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి 109 మిలియన్ కువైటీ దినార్ల ఆదాయం వచ్చింది. మరో 22వేల మంది ప్రవాసులు కొత్తగా వర్క్ ఫోర్స్‌లో చేరడంతో వారి రెసిడెన్సీ ద్వారా 2.7 మిలియన్ కేడీల ఆదాయం సమకూరింది. అలాగే ఫ్యామిలీ సెక్టార్‌కు చెందిన డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) వార్షిక రెసిడెన్సీ, హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ (Health Insurance Renewal) ద్వారా 15 మిలియన్ల కేడీల ఆదాయం వచ్చింది. ఇక ఫ్యామిలీ వీసాలపై (Family Visas) ఆ దేశానికి వెళ్లిన 5.20లక్షల మంది ప్రవాసుల ద్వారా 28.6 మిలియన్ కువైటీ దినార్లు వచ్చాయి. ఇదిలాఉంటే.. కువైత్‌లో వర్క్ పర్మిట్స్, ఆరోగ్య బీమా, నివాస, సివిల్ కార్డుల రెన్యువల్‌కు ఏడాదికి సుమారు 70 కువైటీ దినార్లు (రూ.18,756) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గృహకార్మికులకు 20 దినార్లు (రూ.5,358) ఉంటుంది. ఇక ఫ్యామిలీ రెసిడెన్సీ పర్మిట్, సెల్ఫ్ స్పాన్సర్షిప్‌లకు 55 నుంచి 65 కేడీల (రూ. 14,737నుంచి రూ. 17,416వరకు) ఫీజు ఉంటుంది.

Work Visa Rules: విదేశీయులను ఆకర్షించేందుకు డెన్మార్క్ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!


Updated Date - 2023-04-05T08:26:33+05:30 IST