US: ఉదారత చాటిన భారతీయ అమెరికన్.. హిందూ యూనివర్సిటీకి ఏకంగా రూ. 8.2 కోట్ల భారీ విరాళం!
ABN , First Publish Date - 2023-03-31T08:03:10+05:30 IST
ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్‌యూఏ)కు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రమేశ్ భూతాడ 1మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.2కోట్లు) విరాళంగా ఇచ్చారు.

వాషింగ్టన్, మార్చి 30: ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా (హెచ్‌యూఏ)కు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రమేశ్ భూతాడ 1మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.2కోట్లు) విరాళంగా ఇచ్చారు. అమెరికాలో హిందూ తత్వశాస్త్రం ఆధారంగా విద్యను అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే కావడం విశేషం. 1989లో హెచ్‌యూఏ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ మొత్తంలో విరాళాన్ని పొందలేదు. హూస్టన్‌కు చెందిన స్టార్ పైప్ ప్రొడక్ట్స్‌కు సీఈవోగా ఉన్న రమేశ్ మాట్లాడుతూ.. జీవితంలో చాలా ముందుగానే యువత హిందూత్వానికి సంబంధించిన జ్ఞానం, అవగాహనను పొందడానికి, వారు సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు వీలుగా ఈ విరాళాన్ని అందించినట్టు చెప్పారు.