Share News

IndiGo: మాల్దీవ్స్ వెళ్లేవారికి ఇండిగో తీపి కబురు.. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమానాలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2023-11-01T08:30:29+05:30 IST

మాల్దీవ్స్‌ వెళ్లే ప్రయాణికులకు బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు డైరెక్టర్ విమాన సర్వీసులను (Direct Flights) పునఃప్రారంభించింది.

IndiGo: మాల్దీవ్స్ వెళ్లేవారికి ఇండిగో తీపి కబురు.. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమానాలు పునఃప్రారంభం

హైదరాబాద్: మాల్దీవ్స్‌ వెళ్లే ప్రయాణికులకు బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు డైరెక్టర్ విమాన సర్వీసులను (Direct Flights) పునఃప్రారంభించింది. అక్టోబర్ 31వ తేదీని ఈ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన విమానం 6ఈ 1137 రెగ్యులర్‌గా హైదరాబాద్-మాలే (Hyderabad-Male) రూట్‌లో నడవనుంది. ఈ సర్వీస్ వారంలో మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో ఉంటుంది. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10.20 గంటలకు మాలేకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.35 గంటకు మాలే అంతర్జాతీయ విమానాశ్రయం (Male International Airport) లో ల్యాండ్ అవుతుంది. ఇక అదే రోజు 6ఈ 1138 విమానం మాలే నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు పయనం అవుతుంది. సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. మాల్దీవ్స్ వెళ్లాలనుకునే ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Kuwait: తగ్గేదేలే.. 3నెలల్లో 12వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ!


ఇదిలాఉంటే.. ఇండిగో ఇటీవలే వారానికి మూడు విమానాలను గోవా నుంచి అబుదాబికి ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమ, గురు, శనివారాల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. గోవా కొత్తగా ప్రారంభించిన ఏంఓపీఏ (MOPA) విమానాశ్రయం నుంచి అబుదాబికి విమానాలు నడుస్తున్నాయి. కాగా, నార్త్ గోవా నుండి మధ్యప్రాచ్యానికి (Middle East) మొదటి విమానంగా ఇది ఒక మైలురాయిగా నిలిచింది. అయితే, మునుపటి గోవా విమానాశ్రయం ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) వంటి ఇతర విమానయాన సంస్థల ద్వారా దుబాయ్, దోహా, మస్కట్, బహ్రెయిన్, షార్జాతో సహా వివిధ మధ్యప్రాచ్య గమ్యస్థానాలకు కనెక్టివిటీని కలిగి ఉంది. దీంతో పాటు ఖతర్ ఎయిర్‌వేస్, ఒమన్ ఎయిర్ ఇతర కొన్ని విమానయాన సంస్థలు కూడా సర్వీసులు నడిపిస్తున్నాయి.

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!

Updated Date - 2023-11-01T08:30:29+05:30 IST