Kuwait: కువైత్‌లో అనూహ్య పరిణామం.. భారీగా పెరిగిన డొమెస్టిక్ వర్కర్లు.. అత్యధికులు భారతీయులే!
ABN , First Publish Date - 2023-11-02T09:41:57+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతేడాదితో పోలిస్తే డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 30 శాతం మేర పెరుగుదల నమోదైనట్లు తాజాగా వెలువడిన కార్మికశాఖ గణాంకాలు తెలిపాయి.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతేడాదితో పోలిస్తే డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 30 శాతం మేర పెరుగుదల నమోదైనట్లు తాజాగా వెలువడిన కార్మికశాఖ గణాంకాలు తెలిపాయి. 2021 చివరినాటికి 5.83లక్షలుగా ఉన్న గృహ కార్మికుల సంఖ్య 2023 అక్టోబర్‌కు 8.11లక్షలకు చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిలిప్పిన్స్ కార్మికుల నియమకాలపై నిషేదం విధించిన కువైత్.. డొమెస్టిక్ వర్కర్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను కేవలం భారత్, శ్రీలంక కార్మికులకు మాత్రమే పరిమితం చేసిన విషయం తెలిసిందే. అయినా డొమెస్టిక్ వర్కర్ల సంఖ్యలో భారీగా పెరగడం గమనార్హం. ఇక తాజాగా వెలువడిన లేబర్ స్టాస్టిక్స్ ప్రకారం.. 2023లో ఒక్క భారత్ నుంచే అత్యధికంగా 30 శాతం గృహ కార్మికులు కువైత్ వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఆ దేశంలో పని చేస్తున్న డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య 3.71 లక్షలకు చేరింది. ఇందులో 28.3 శాతం మంది మహిళలు, 71.7 శాతం పురుషులు ఉన్నారు. కాగా, శ్రీలంక నుంచి కార్మికుల సంఖ్య భారీగా తగ్గింది. 2022లో 79వేల మంది ఉంటే.. 2023 అక్టోబర్ నాటికి 48వేలకు పడిపోయింది. మొత్తంగా భారత్ 3.71 లక్షల మంది కార్మికులతో టాప్‌లో ఉంటే.. ఆ తర్వాత వరుసగా ఫిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇథియోపియా ఉన్నారు.
Oman: విజిట్ వీసాల విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వెసులుబాటు లేదు!
2023 అక్టోబర్ నాటికి కువైత్‌లో వివిధ దేశాలకు చెందిన గృహ కార్మికులు ఇలా..
* భారత్: 3,71,222 (71.3 శాతం పురుషులు – 28.7 శాతం స్త్రీలు)
* ఫిలిప్పీన్స్: 2,01,110 (0.6 శాతం పురుషులు – 99.4 శాతం స్త్రీలు)
* శ్రీలంక: 1,03,685 (20.6 శాతం పురుషులు – 79.4 శాతం స్త్రీలు)
* బంగ్లాదేశ్: 85,989 (99 శాతం పురుషులు - 1 శాతం మహిళలు)
* నేపాల్: 25,540 (4.7 శాతం పురుషులు - 95.3 శాతం స్త్రీలు)
* ఇథియోపియా: 11, 684 (8.2 శాతం పురుషులు – 91.8 శాతం స్త్రీలు)
* ఇతర జాతీయులు: 11, 616 మంది కార్మికులు (59.1 శాతం పురుషులు - 40.9 శాతం స్త్రీలు)