Oman: విజిట్ వీసాల విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వెసులుబాటు లేదు!
ABN , First Publish Date - 2023-11-02T07:09:31+05:30 IST
విజిట్ వీసాల విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విజిట్ వీసాలను వర్క్ వీసాలు (Work visas) గా మార్చేదిలేదని రాయల్ ఒమాన్ పోలీసులు (Royal Oman Police) స్పష్టం చేశారు.
మస్కట్: విజిట్ వీసాల విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విజిట్ వీసాలను వర్క్ వీసాలు (Work visas) గా మార్చేదిలేదని రాయల్ ఒమాన్ పోలీసులు (Royal Oman Police) స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. ఇకపై టూరిస్ట్ లేదా విజిట్ వీసాల (Visit visas) ను వర్క్ వీసాలుగా మార్చుకునే విధానానికి స్వస్తి పలికినట్లు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకుముందు సందర్శకులు విజిట్ లేదా టూరిస్ట్ వీసాపై ఒమాన్‌లోని ప్రవేశించి, ఆపై దానిని వర్క్ వీసాగా మార్చుకునే వెసులుబాటు ఉండేది. కొత్త నిర్ణయం అక్టోబర్ 31వ తారీఖు నుంచే అమల్లోకి వచ్చినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇక బంగ్లాదేశీయులకు కొత్త వీసాల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే.
Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!
మరోవైపు వంద దేశాల నుంచి జీసీసీ నివాసితులు ఒమాన్ వెళ్లడానికి వీసా అక్కర్లేదని ప్రకటించారు. గతేడాది గల్ఫ్ దేశం ఈ జాబితాను విడుదల చేసింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Co-operation Council) దేశాలకు ఏకీకృత టూరిస్ట్ వీసా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇవి వచ్చే ఏడాది ప్రారంభంలో జారీ కానున్నాయని యూఏఈ మంత్రి ఒకరు అక్టోబర్‌లో తెలియజేశారు. దీంతో ఒకే వీసాతో పర్యాటకులు ఆరు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్, బహ్రెయిన్, కువైత్, యూఏఈలను సందర్శించే వెసులుబాటు కలిగింది.