Adani Group Stocks Rally: అదానీ షేర్ల దూకుడుతో ఆ ఎన్నారై పంటపడింది.. రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 3,100 కోట్ల లాభం..!
ABN , First Publish Date - 2023-03-05T10:19:54+05:30 IST
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ (Hindenburg Research Report) దెబ్బకు భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లన్నీ (Adani Group) ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి.
NRI: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ (Hindenburg Research Report) దెబ్బకు భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లన్నీ (Adani Group) ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. దాంతో వరుసగా నాలుగు సెషన్లు లాభాల బాటపట్టాయి. అదానీ గ్రూపునకు చెందిన పది షేర్లలో చాలా వరకు గడిచిన నాలుగు రోజులుగా అప్పర్‌సర్క్యూట్ కొట్టాయి. దాంతో వాటిలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు కనకవర్షం కురుస్తోంది. ఇలాగే అమెరికాకు చెందిన (US-based) ఒక ఎన్నారై ఇన్వెస్టర్ (NRI Investor) అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల కారణంగా రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 3,102 కోట్ల లాభం గడించారు. భారత సంతతికి చెందిన రాజీవ్ జైన్ (Rajiv Jain) అనే ఎన్నారై ఇలా భారీ లాభాలు పొందారు. అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా నడిచే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్ (GQG Partners) స్థాపకుడే ఈ రాజీవ్ జైన్. ఇంతకూ ఆయన ఎంత పెట్టుబడులు పెట్టారు? ఇప్పుడు అంతగా ఎలా పెరిగిందో ఓ లుక్కేద్దాం.
రాజీవ్ జైన్ గత వారం ప్రారంభంలో బ్లాక్ డీల్స్ (Block Deals) లావాదేవీల ద్వారా అదానీ గ్రూప్‌నకు చెందిన 4 కంపెనీల్లో రూ.15,446 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది స్పెషల్ ట్రేడింగ్ విండో ద్వారా జరిగింది. బ్లాక్ డీల్స్ అంటే మార్కెట్ ఆరంభ గంటల్లో ఉదయం 9.15 నుంచి 9.50 గంటల మధ్య జరుగుతుంది. అంతే.. పట్టిందల్లా బంగారమే అన్నట్లు రాజీవ్ జైన్‌కు భారీ లాభాలొచ్చి పడ్డాయి. అదే సమయంలో అప్పర్‌సర్క్యూట్స్ కూడా కొట్టడంతో ఇక లాభాలకు అడ్డే లేకుండా పోయింది. దాంతో ఆయన పెట్టిన పెట్టుబడిపై రెండు రోజుల్లోనే ఏకంగా 20శాతం వరకు లాభాలు వచ్చాయి. ఇది సుమారు రూ.3,102 కోట్లకు సమానమని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. గురు, శుక్రవారాల్లోనే ఈ లాభం వచ్చింది. దీంతో ఇప్పుడు రాజీవ్ జైన్ ఇన్వెస్ట్‌మెంట్ విలువ మొత్తంగా రూ.18,548 కోట్లకు చేరడం విశేషం.
ఇది కూడా చదవండి: మీకు టూరిస్ట్ వీసా ఉంటే చాలు.. కెనడాలో రెండేళ్లు ఎంచక్కా పని చేసుకోవచ్చు..!
ఇక బ్లాక్ డీల్స్ ద్వారా జీక్యూజీ పార్ట్‌నర్స్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (Adani Enterprises Limited), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్(Adani Ports and Special Economic Zone Limited), అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (Adani Green Energy Limited), అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్(Adani Transmission Limited) కంపెనీల్లోని కోట్లాది షేర్లను వేల కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కాగా, ఒక అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు గత ఐడు సెషన్లలో ఏకంగా 43 శాతానికిపైగా పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 17 శాతం వరకు పుంజుకోవడం విశేషం. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం అప్పర్‌సర్క్యూట్‌లో లాకయ్యాయి. ఇక అదానీ పోర్ట్స్ ఒక్కరోజే 9.81 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!