Avinash In Viveka Case : అవినాష్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది.. వైఎస్ భారతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది.. కోట్లలో బెట్టింగ్‌లు..!?

ABN , First Publish Date - 2023-04-28T22:50:05+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YSRCP MP Avinash Reddy) అరెస్ట్ తప్పదా..?

Avinash In Viveka Case : అవినాష్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది.. వైఎస్ భారతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది.. కోట్లలో బెట్టింగ్‌లు..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YSRCP MP Avinash Reddy) అరెస్ట్ తప్పదా..? అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయాయా..? వరుసగా రెండ్రోజులపాటు విచారించిన హైకోర్టు (TS High Court) ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఉలిక్కిపడిందా..? హైకోర్టు సీజే బెంచ్ (CJ Bench) ఏకంగా సుప్రీంకోర్టు సీజేఐ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ కోర్టుపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని స్పష్టం చేయడంతో అతి త్వరలోనే ఎంపీని అరెస్ట్ చేయడానికి సీబీఐ (CBI) సన్నాహాలు చేస్తోందా..? మరోవైపు.. అవినాష్ అరెస్ట్ అవుతారని కొందరు.. ఆ ఛాన్సే లేదని మరికొందరు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే బెట్టింగ్‌లు కాస్తున్నారా..? అంటే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చూస్తుంటే ఇదే అక్షరాలా నిజమయ్యే అవకాశాలున్నాయని న్యాయ, రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవినాష్ అరెస్ట్ తర్వాత వైసీపీ ఏం చేయబోతోంది..? ఈ మధ్య ఎక్కడ చూసినా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గురించి వస్తున్న రూమర్స్‌లో నిజమెంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

TS-High-Court.jpg

ఎప్పుడేం జరుగుతుందో టెన్షన్.. జరుగుతుందో..!?

అవినాష్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టు, సీజే బెంచ్ తీర్పు తర్వాత హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీపీ పెద్దలు, సీనియర్ న్యాయవాదులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితులు అయితే లేవు కనుక ఏం చేద్దాం..? ఎలా ముందుకెళ్దాం..? అని ప్రత్యామ్నాయాలపై వైసీపీ పెద్దలు దృష్టి పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే.. హౌస్‌మోషన్ మూవ్ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్ న్యాయవాదులతో పెద్దలు చర్చించారని తెలియవచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళితే మళ్లీ ఇబ్బందులేనని సీనియర్ న్యాయవాదులు చెప్పారట. అయితే.. ఈలోపే అవినాష్‌‌ను అరెస్ట్ చేస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. అయితే.. సీబీఐని కట్టడి చేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయాలని వైసీపీ నిర్ణయించిందట. అటు సుప్రీంకోర్టు.. ఇటు హైకోర్టు తీర్పుల తర్వాత సీబీఐ యమా దూకుడు మీద అయితే ఉంది. ఒకట్రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవినాష్‌ను అరెస్ట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Sunitha-And-Avinash.jpg

కోటానుకోట్లలో బెట్టింగ్‌లు..!

అవినాష్‌ను పక్కాగా అరెస్ట్ చేస్తారని కొందరు.. అస్సలు ఎంపీని ఎవరూ టచ్‌ చేయలేరని ఇంకొందరు కోట్లలో బెట్టింగ్‌లో నడుస్తున్నాయట. ముఖ్యంగా పులివెందులలో కొందరు ఎంపీకి అత్యంత సన్నిహితులు ఒకరిద్దరు కోటి నుంచి నాలుగు కోట్ల వరకూ బెట్టింగ్‌లు కట్టారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వస్తుండటం.. అది కూడా వైసీపీ వీరాభిమానులే ఇలా వైరల్ చేస్తుండటం గమనార్హం. అడ్వాన్స్‌గా కొంత డబ్బులు కూడా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. తెలంగాణలోనూ కొందరు బెట్టింగ్‌లు కాస్తుండటం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గానే మారింది. ఈ బెట్టింగ్‌ సంగతేంటో కానీ.. అవినాష్‌కు ఉచ్చు బిగుస్తుండటంతో అభిమానుల్లో మాత్రం ఎప్పుడేం జరుగుతుందో అని గంట గంటకూ నరాలు తెగే ఉత్కంఠ అయితే నెలకొంది. అరెస్ట్ అయితే ఎక్కడికక్కడ ఆయన అభిమానులు, అనుచరులు రెచ్చిపోతారని ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఓ నివేదికను జగన్ సర్కార్‌కు నివేదిక రూపంలో ఇచ్చిందట. ఇప్పటికే కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏ క్షణమైనా 144 సెక్షన్ అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

YS-Viveka-PSDD.jpg

భారతీరెడ్డి రంగంలోకి దిగుతారా..!?

ఇక అసలు విషయానికొస్తే.. అవినాష్‌ను అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీలో ఏం జరగబోతోంది..? ముఖ్యంగా కడప పార్లమెంట్ స్థానానికి ఇంచార్జ్‌ను నియమిస్తారా..? ఆ ఇంచార్జ్‌ బాధ్యతలు వైఎస్ భారతీరెడ్డికే అప్పగిస్తారా..? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. పులివెందులలోనే కాదు కడప జిల్లాలో ఎక్కడ చూసినా భారతీ గురించే చర్చ నడుస్తోంది. వాస్తవానికి కడపలో ఇప్పుడు వైసీపీ బాధ్యతలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వైఎస్ వివేకా తర్వాత అవినాష్ కుటుంబమే చూస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో అవినాష్ అరెస్ట్ అయితే వైఎస్ ఫ్యామిలీకే కాదు.. వైసీపీకి కోలుకోలేని ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులతో పాటు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. ఇంచార్జ్ ఒక్కటే కాదు.. రానున్న ఎన్నికల్లో భారతీ రెడ్డి తప్ప కడప ఎంపీ స్థానానికి జగన్‌కు వేరే ఆప్షన్ లేదట. అందుకే ఈ పరిస్థితుల్లో వైఎస్ కుటుంబం నుంచి కాకుండా ఇతరులను వైసీపీ అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానం నుంచి నిలిపితే రాజకీయంగా నష్టం తప్పదని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇన్ని లెక్కల నడుమ జగన్‌ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ వైఎస్ భారతి. వివేకా హత్య కేసులో భారతి ప్రమేయంపై వార్తలొస్తున్నప్పటికీ సీబీఐ ఆమెను ఇప్పటివరకైతే విచారించలేదు. అందువల్ల.. తన భార్యను కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి నిలపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

Avinash-and-Bharati.jpg

- జగన్ తన తల్లి విజయమ్మపై ఒత్తిడి చేసి కడప నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపే ఆలోచన చేయకపోవడానికి విశాఖ చేదు అనుభవమే కారణంగా తెలుస్తోంది. పైగా.. విజయమ్మ ముందు జగన్ ఆ ప్రతిపాదన నిలిపినా ఆమె ఎంతవరకూ సుముఖత వ్యక్తం చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామాలన్నీ.. వచ్చే ఎన్నికల్లో భారతి పొలిటికల్ ఎంట్రీని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. జగన్ భార్య భారతి ప్రస్తుతం సొంత మీడియా బాధ్యతలను, మిగిలిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. భారతి పొలిటికల్ ఎంట్రీపై వార్తలు రావడం కొత్తేం కాదు. వివేకా విచారణ ఇంతవరకూ రాక ముందు జమ్మలమడుగు నుంచి వచ్చే ఎన్నికల్లో భారతి పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం కడప పార్లమెంట్ స్థానం నుంచి జగన్ భార్య భారతి పోటీకి నిలవక తప్పని పరిస్థితులున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

YS-Jagan-Sitting.jpg

మొత్తానికి చూస్తే.. అవినాష్ అరెస్ట్ అవుతారా లేదా అని పక్కనెడితే లెక్కలేనన్ని రూమర్స్ మాత్రం పుట్టుకొస్తున్నాయ్. ఇందులో నిజానిజాలెంతో అనేది ఒకట్రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక భారతీ సంగతంటారా.. వైఎస్ జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహకందవు అని అందరూ అంటుంటారు. అరెస్ట్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏంటో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : అవినాష్ విషయంలో హైకోర్టు తీర్పుతో వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. హుటాహుటిన సమావేశమై..

******************************

Avinash In Viveka Case : హైకోర్టు తీర్పు తర్వాత సీజే బెంచ్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. తిప్పలు తప్పవా..!?

******************************

Avinash In Viveka Case : వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం తేల్చిందంటే..

******************************

Avinash In Viveka Case : అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కంటిన్యూ.. పలు లాజిక్‌లు చెప్పిన ఎంపీ తరఫు న్యాయవాది.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

******************************

Updated Date - 2023-04-28T23:00:16+05:30 IST