Times Now-ETG Survey: ETG సంస్థ ఎవరిది? వైసీపీకి అనుకూలంగా ఎందుకు సర్వే ఇచ్చారు?

ABN , First Publish Date - 2023-10-03T14:15:45+05:30 IST

టైమ్స్ నౌ ఛానల్‌‌తో డీల్‌ను అడ్డం పెట్టుకుని ETG సంస్థ చేసిన ఫేక్ సర్వేను వైసీపీ ప్రజలపై రుద్దింది. ఏపీ సీఎం జగన్‌కు ETG సంస్థ యజమాని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది రూ. 45 లక్షలు జీతభత్యాలు డ్రా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి.

Times Now-ETG Survey: ETG సంస్థ ఎవరిది? వైసీపీకి అనుకూలంగా ఎందుకు సర్వే ఇచ్చారు?

చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరుగుతుందన్న అక్కసుతో వైసీపీ మరో ఫేక్ సర్వే విడుదల చేయించింది. తమ చెప్పుచేతల్లో ఉన్న టైమ్స్ నౌ ఛానల్‌‌తో డీల్‌ను అడ్డం పెట్టుకుని ETG సంస్థ చేసిన ఫేక్ సర్వేను ప్రజలపై రుద్దింది. ఎప్పటిలాగానే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అసలు ఈ సర్వేకు ఎంత విశ్వసనీయత ఉందో అన్న విషయానికి వద్దాం. ఈటీజీ రీసెర్చ్ సంస్థను యోగి స్ట్రాటజీస్ ఎల్‌ఎల్‌పీ, విదుర కన్సల్టింగ్ సంస్థలు నడుపుతున్నాయి. వీటికి యజమాని అవినాష్ ఇరగవరపు. ఈయన ఎవరో కాదు.. ఏపీ సీఎం జగన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది రూ. 45 లక్షలు జీతభత్యాలు డ్రా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి. దీనికి ప్రతిఫలంగా ఈటీజీ సంస్థ పేరుతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఫేక్ సర్వేలను టైమ్స్ నౌ వాళ్లకు పంపి నెలకోసారి అవినాష్ ఇరగవరపు ప్రసారం చేయిస్తున్నారు.

కాగా అవినాష్ ఇరగవరపు జీతభత్యాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ తొత్తులను అడ్డం పెట్టుకుని సర్వేలు విడుదల చేసి ప్రజలను మాయ చేయాలన్న ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఉందని.. అసలు అంత భయపడాల్సిన అవసరం ఏంటని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ సర్కారు పూర్తిగా డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల నెత్తిన బోగస్ సర్వేలను ప్రవేశపెడుతూ వాళ్లను ఏమార్చేందుకు తనకు తెలిసిన రీతిలో కుయుక్తులు పన్నుతోంది. ఫేక్ సర్వేలను బూచిగా చూపించి జగన్ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లారన్న సానుభూతి లేదని.. టీడీపీ అవినీతి చేసిందని ప్రజలు నమ్ముతున్నారని విషప్రచారం చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితి మరోలా ఉండటంతో వైసీపీ విడుదల చేయిస్తున్న సదరు సర్వేలను చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు.

avinash iragavarapu.jpg


మరోవైపు దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వైసీపీ తాపత్రయపడుతోంది. కేంద్ర ప్రభుత్వ అండతో ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేసి ప్రచారంలో పాల్గొనకుండా కుట్రలకు తెరలేపింది. జాతీయ మీడియా పేరుతో వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఫలితాలను వెల్లడిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. అయితే ప్రజలు వైసీపీ కుయుక్తులను గమనించి ఈ సర్వేలను నమ్మకుండా సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్‌లో ఓటమి భయం మరింత పెరిగింది కాబట్టే ఆయన ఫేక్ సర్వేలను నమ్ముకున్నారని.. ఈ సర్వేలపై చర్చ జరిగి ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-03T14:15:45+05:30 IST