Ponguleti : తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యక్షమైన పొంగులేటి.. జగన్‌తో గంటపాటు ఏకాంత భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఓహో అసలు కథ ఇదా..!

ABN , First Publish Date - 2023-02-10T23:13:50+05:30 IST

ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. (Ponguleti Sreenivasa Reddy) ఈ మధ్య ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్‌లో ఉన్న పొంగులేటి..

Ponguleti : తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యక్షమైన పొంగులేటి.. జగన్‌తో గంటపాటు ఏకాంత భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఓహో అసలు కథ ఇదా..!

ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. (Ponguleti Sreenivasa Reddy) ఈ మధ్య ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్‌లో ఉన్న పొంగులేటి.. ఇప్పుడు ఆ పార్టీకే రెబల్‌గా మారి సీఎం కేసీఆర్‌ను (CM KCR) మొదలుకుని, బీఆర్ఎస్ (BRS) అధిష్టానం, మంత్రులపై (TS Ministers) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒక్కప్పుడు ఏరికోరి మరీ బీఆర్ఎస్‌లో చేరిన ఈయన.. ఇప్పుడు ఏకంగా సవాళ్లు చేసే పరిస్థితికి వచ్చారు. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయండంటూ పొంగులేటి చేసిన కామెంట్స్ జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యాయి. అయితే ఇప్పుడాయన ఏ పార్టీలో ఉన్నారు..? పోనీ పార్టీ మారాల్సి వస్తే ఏ పార్టీలో చేరతారనే విషయంపై క్లారిటీ లేదు కానీ.. నిత్యం ప్రజల్లో తిరగడం, ఆత్మీయ సమ్మేళనం అంటూ కేడర్‌కు టచ్‌లో ఉంటున్నారు. ఈ మధ్య మరో అడుగు ముందుకేసి ఇదిగో ఫలానా వ్యక్తి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజిబిజీగా ఉన్నారు. ఉన్నట్టుండి.. తాడేపల్లి ప్యాలెస్‌లో (Tadepalli) పొంగులేటి ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఆయన తెలంగాణ నుంచి (Telangana) ఏపీకి (AP)వెళ్లి సీఎం వైఎస్ జగన్‌తో (CM YS Jagan) ఎందుకు భేటీ అయ్యారు..? ఆయన వ్యక్తిగత పనులపై వెళ్లారా..? పార్టీ మార్పు, ఎమ్మెల్యే టికెట్ల విషయమై చర్చించడానికి వెళ్లారా..? అనేదానిపై ప్రత్యేక కథనం.

Ponguleti-1.jpg

వరుస భేటీలతో బిజీబిజీ..

బీఆర్ఎస్‌కు పొంగులేటి వ్యతిరేకం అయ్యారన్నప్పటి నుంచీ బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), వైఎస్సా్ర్టీపీ (YSRTP) పెద్దలు ఆయనకు టచ్‌లోకి వెళ్లారు. ఆ మధ్య రేపో మాపో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో కమలం కండువా కప్పుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే టికెట్లు కూడా కోరుకున్న చోట ఇస్తామని ఆఫర్ చేశారనే టాక్ కూడా నడిచింది. అయితే ఈ రెండు పార్టీలను కూడా పొంగులేటి ఎందుకో పక్కనపెట్టారు. వైఎస్ ఫ్యామిలీకి (YS Family) వీరవిధేయుడుగా ఉండే పొంగులేటి.. వైఎస్ షర్మిల (YS Sharmila) స్థాపించిన వైఎస్సార్టీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. షర్మిలతో రహస్యంగా భేటీ అయ్యారని.. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా మారుమాట చెప్పకుండా రెడీ అన్నారని తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) చర్చ జరిగింది. ఆ తర్వాత డైరెక్టుగా వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా వరుస భేటీలతో భేటీ కావడంతో వైఎస్సార్టీపీ కండువా కప్పుకోవడం పక్కా అని ఆయన అనుచరులు, కార్యకర్తలు అందరూ అనుకున్నారు. ఫిబ్రవరి-8న అధికారికంగా విజయమ్మ, షర్మిల సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారని ఆయన ముఖ్య అనుచరులు చెప్పుకున్నారు. అయితే ఫిబ్రవరి-8 పోయి రెండ్రోజులైనా ఇంతవరకూ చలీచప్పుడు లేదు.

Ponguleti-2.jpg

జగన్‌తో ప్రత్యేక భేటీ..

తెలంగాణ రాజకీయాల్లో ఈ రేంజ్‌లో పొంగులేటి గురించి చర్చలు జరుగుతుండగా ఉన్నట్టుండి తాడేపల్లి ప్యాలెస్‌లో తేలారు. శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జగన్-పొంగులేటి (Jagan-Ponguleti) ఏకాంతంగా భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్టీపీలో చేరికపై 20 నిమిషాలు చర్చ జరిగినట్లు సమాచారం. షర్మిల పార్టీలో చేరాలని నిర్ణయానికి వచ్చిన తర్వాతే జగన్ ఆశీర్వాదం కోసం ఏపీకి వెళ్లారని అందరూ అనుకుంటున్నారు. రాజకీయంగా పునర్జన్మ పొందడం ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సాధ్యపడుతుందని జగన్‌తో భేటీలో ధీమాగా పొంగులేటి చెప్పినట్లు సమాచారం. విజయమ్మ సమక్షంలో కండువా కప్పుకుని ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జగన్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు రాజీనామా విషయంపై భేటీలో చర్చకు రాగా.. దానిపై కూడా రేపో.. మాపో తేల్చేస్తానని పొంగులేటి చెప్పినట్లు సమాచారం. ఈ ఒక్క భేటీ తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం అంతా హాట్ టాపిక్ అయ్యింది.

Ponguleti.jpg

భేటీపై ఇలా కూడా..!

కాంట్రాక్టర్ (Contracter) అయిన పొంగులేటి.. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాంట్రాక్టు వర్కులు చేశారు. ఇప్పటి వరకూ తెలంగాణలో ఆయన చేసిన పనులకు పెండింగ్ లేకుండా బిల్లులు మొత్తం ప్రభుత్వం చెల్లించేసిందట. అందుకే కేసీఆర్ సర్కార్‌పై ఈ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారట. ఇక చాలా రోజులుగా ఏపీలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ ఉండటంతో వాటిని క్లియర్ చేసుకోవడానికే జగన్‌తో భేటీ అయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భేటీ వెనుక ఇదే అసలు విషయమని నెట్టింట్లో గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. భేటీ తర్వాత ఎక్కడా మీడియాతో కానీ.. సోషల్ మీడియాలో కానీ పొంగులేటి రియాక్ట్ అవ్వలేదు. దీంతో ఈ భేటీ వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కట్లేదు.

Sharmila.jpg

మొత్తానికి చూస్తే.. జగన్-పొంగులేటి భేటీపై చిత్రవిచిత్రాలుగానే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో వరుస భేటీలు, ప్రకటనల తర్వాత ఏపీకి వెళ్లి జగన్‌తో ఎందుకు భేటీ అయ్యారు..? ఫైనల్‌గా భవిష్యత్ కార్యాచరణపై ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయాలపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో.

ఇవి కూడా చదవండి..

AP Politics : పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్న ప్రశ్న.. టీడీపీలో ఎందుకు చేరలేదు అని బాలయ్య అడగ్గా.. పవన్ చెప్పిన సమాధానం ఇదీ.. హై ఓల్టేజ్..


Ponguleti : అభిమానుల సాక్షిగా పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పొంగులేటి.. అంతా సరే కానీ..!

YS Jagan : మైలవరం పంచాయితీపై ఒక్కమాటతో తేల్చేసిన సీఎం జగన్.. భేటీ తర్వాత పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన వసంత కృష్ణప్రసాద్.. ఇదీ అసలు కథ..


*************************

ఇవి కూడా చదవండి..

Telugudesam : ఫిబ్రవరి16న టీడీపీలో చేరనున్న కీలక వ్యక్తి.. పెద్ద బాధ్యతలు అప్పగించనున్న చంద్రబాబు..


*************************

YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

*************************

YS Jagan : శభాష్ అంటూ ముగ్గురు మంత్రులను మెచ్చుకున్న వైఎస్ జగన్.. అందులో ఒకరు...!

*************************

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

*************************


KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

*************************

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************



Updated Date - 2023-02-10T23:44:04+05:30 IST