TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

ABN , First Publish Date - 2023-06-16T13:33:55+05:30 IST

పొంగులేటి, జూపల్లి (Ponguleti, Jupally).. ఈ పేర్లు గత రెండు, మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu State Politics) హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇద్దరి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనేదానిపైనే చర్చ జరుగుతూనే ఉంది.

TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

పొంగులేటి, జూపల్లి (Ponguleti, Jupally).. ఈ పేర్లు గత రెండు, మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu State Politics) హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇద్దరి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనేదానిపైనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే కాంగ్రెస్‌లో (Congress) చేరాలని ఇద్దరూ ఫిక్స్ కావడం, ఆ పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు కావడంతో చేరిక ఒక్కటే మిగిలుందని అంతా అనుకున్నారు కానీ అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఎందుకో ఆలస్యమైంది. అసలే ఆలస్యం అంటే.. దీనికి తోడు ఇంకా సమాలోచనలు చేస్తూ ఉండిపోయారు. దీంతో ఎందుకు ఇంకా పొంగులేటి, జూపల్లి వెనకడుగేస్తున్నారు..? మళ్లీ ఏమైనా మనసు మార్చుకున్నారా..? లేకుంటే ఇంకేమైనా జరిగిందా..? అని నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు ఆలోచనలో పడ్డారు. ఈ అనుమానాలన్నింటికీ శుక్రవారం నాటితో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు.. ముహూర్తం కూడా నేతలు ఫిక్స్ చేసుకున్నారు.

Congress.jpg

ఎన్నాళ్లకెన్నాళ్లకు..?

బీఆర్ఎస్ బహిష్క్రృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఇద్దరూ కాంగ్రెస్‌లో (Congress) చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ నెలాఖరున పొంగులేటి, జూపల్లితో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి (Kuchukulla Damoder Reddy) కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం అమెరికా పర్యటనలో (Rahul America Tour) బిజిబిజీగా ఉన్నారు. యువనేత పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ఈ చేరికలు ఉంటాయని రాష్ట్ర అధిష్టానం స్పష్టం చేసింది. ఈ నెల 22న అమెరికా నుంచి రాహుల్ ఢిల్లీ రానున్నారు. అయితే.. ఢిల్లీలో కాకుండా ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి పొంగులేటి చేరబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ వేదికగా జరిగే సభలో జూపల్లి, దామోదర్ రెడ్డి.. రాహుల్ సమక్షంలో కండువాలు కప్పుకోనున్నారు. మొత్తానికి చూస్తే.. కాంగ్రెస్‌లో చేరుతున్నారని నేతలిద్దరూ.. అటు పార్టీలోని కీలక నేతలు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఖమ్మం, నాగర్ కర్నూలు‌లో సభలు ఎప్పుడనే విషయంపై మాత్రం క్లారిటీ రావట్లేదు. రాహుల్ అమెరికా పర్యటన ఉన్నారు కాబట్టే జూపల్లి, పొంగులేటి చేరిక ఆలస్యమైందన్న మాట.

Ponguleti-and-jupally.jpg

నంబర్ పెరుగుతూనే ఉంది..!

బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. జూపల్లి కలిశాక తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై ఇద్దరి మధ్య అంతర్గత సమావేశాలు జరిగాయి. అదే సమయంలో ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ఎస్‌కే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు. దీంతో ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు. ఈ మధ్యే సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు శ్రీహరి రావు కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఎల్లుండి (జూన్-18న) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రోజురోజుకూ తెలంగాణ కాంగ్రెస్‌లో చేరే నేతల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. మొత్తానికి చూస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచిరోజులు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్‌‌ ఇంకా పూర్తిగా మొదలవ్వకుండానే చేరికలు ఈ రేంజ్‌లో ఉన్నాయంటే.. ఇంకా ఎన్నికలు సమీపిస్తే మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?


******************************

Telugu States Politics : బీఆర్ఎస్‌లో అంతా గందరగోళం.. తండ్రిదో దారి.. కొడుకుదో దారి.. మంత్రులది మరోదారి.. ఎందుకీ పరిస్థితి..?

******************************

Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

******************************

Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?

******************************

Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?

******************************

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

*****************************

Updated Date - 2023-06-16T13:41:51+05:30 IST