Manoj Mounika: పొలిటికల్ ఎంట్రీపై ఒక్క మాటతో తేల్చేసిన మంచు మనోజ్.. మౌనికకు లైన్ క్లియర్ అయినట్లేనా..!
ABN , First Publish Date - 2023-03-06T17:20:38+05:30 IST
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) ఇటీవల మూడు ముళ్ల బంధంతో (M Weds M) ఒక్కటయ్యారు. ఇలా పెళ్లయ్యిందో లేదో.. బాబోయ్ లెక్కలేనన్ని వార్తలు ఈ జంటపై వచ్చాయ్..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) ఇటీవల మూడు ముళ్ల బంధంతో (M Weds M) ఒక్కటయ్యారు. ఇలా పెళ్లయ్యిందో లేదో.. బాబోయ్ లెక్కలేనన్ని వార్తలు ఈ జంటపై వచ్చాయ్.. అంతకుమించి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో (Social Media) హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం ఈ పెళ్లి గురించే జనాలు గూగుల్‌లో (Google) తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో అసలు వీరిద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది..? స్నేహం కాస్త ప్రేమగా ఎలా మారింది.. పెళ్లి దాకా వెళ్లడానికి కారణాలేంటి..? ఇలా చిత్రవిచిత్రాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే పెళ్లయ్యాక కాన్వాయ్‌తో (Manoj Convoy) మనోజ్.. అత్తగారిల్లు కర్నూలుకు (Kurnool) వెళ్లడంతో ఇదంతా చూసిన జనాలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే.. భూమా ఫ్యామిలీకి (Bhuma Family) రాజకీయ నేపథ్యం ఉండటం, మంచు ఫ్యామిలీకి (Manchu Family) కూడా సినిమా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి. మరోవైపు.. పెళ్లాయ్యాక ఈ జంట కూడా వరుసగా రాజకీయ నాయకులను కలవడం, వీరి వెంట పొలిటికల్ లీడర్స్ (Political Leaders) కూడా ఎక్కువగా ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ (Political Entry) పక్కా అని అందరూ అనుకుంటున్నారు. ఈ వార్తలు ఆ నోటా.. ఈ నోటా పడి మనోజ్ చెవిన పడటంతో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. మౌనికా రెడ్డి (Mounika Reddy) ఎంట్రీ గురించి కూడా మనోజ్ మాట్లాడారు.
ఒకే ఒక్క మాటతో..!
పెళ్లయ్యాక ఈ నవ దంతులు తిరుమల శ్రీవారి (Tirumala Venkanna) దర్శనానికి వెళ్లారు. వెంకన్నను దర్శించుకున్నాక మీడియాతో ముచ్చటించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే తనకు పెళ్లయ్యిందన్నారు. అలాగే బాబు (Manoj Son) కూడా తమ జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉందని ఇదంతా శ్రీవారి దయతోనే జరిగిందన్నారు. అంతేకాదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడని మనోజ్.. రియల్ లైఫ్‌లో డైలాగ్ పేల్చారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై మీ స్పందనేంటి..? అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి చాలా లాజిక్‌గా మనోజ్ సమాధానమిచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. ప్రజాసేవ చేయాలని కోరిక మాత్రం ఉందన్నారు. అలాగే త్వరలోనే తన ‘వాట్ ద ఫిష్’ (What The Fish) మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.
మౌనిక ఎంట్రీపై కూడా..!
మౌనికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీపై కూడా మనోజ్ రియాక్ట్ అయ్యారు. మౌనిక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం తాను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానన్నారు. ప్రజా సేవ చేయాలనే ఆలోచను తమను కలిపిందన్నారు. కాగా.. భూమా ఫ్యామిలీ.. కర్నూలు జిల్లా రాజకీయాల్లో (Kurnool Politics) పేరుగాంచినదే. అలాగే మౌనికారెడ్డికి కూడా రాజకీయాలేమీ కొత్తకాదు.. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపులో కీలక పాత్రే పోషించారు. అంత టఫ్ ఫైట్‌లోనూ ప్రత్యర్థులను ఎదుర్కొని అన్నకు అన్నీ తానై నిలబడ్డారని మౌనిక గురించి అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్నుంచే ఆమె రాజకీయాల్లోకి రావాలని భూమా వీరాభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మౌనిక రాజకీయాల్లోకి వచ్చినా రావచ్చని ఇప్పటికే అందరూ భావిస్తుండగా.. ఇప్పుడు తన భర్త మనోజ్ కూడా అన్ని విధాలా సపోర్టు చేస్తానని చెప్పడంతో ఇక లైన్ క్లియర్ అయినట్లేనని స్పష్టంగా అర్థమవుతోంది. మనోజ్ కామెంట్స్‌తో మౌనిక కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారట.
మొత్తానికి చూస్తే.. తాను రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రస్ట్ లేదని చెబుతూనే.. మౌనికకు మాత్రం మనోజ్ లైన్ క్లియర్ చేశారన్న మాట. పైగా ఇప్పుడు భూమా ఫ్యామిలీ టీడీపీలో (TDP) ఉండగా.. మంచు ఫ్యామిలీ వైసీపీలో (YSR Congress) ఉంది. అంటే అధికార, ప్రతిపక్ష పార్టీతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక భర్త సపోర్టుతో మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా.. రానున్న ఎన్నికల్లో పోటీచేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం మరి.