YSR Congress : చేతులెత్తేసిన వైఎస్ జగన్... ఓటమి భయం పట్టుకుందా.. ఆ ఒక్క మాటతో..!?
ABN , First Publish Date - 2023-02-28T16:25:35+05:30 IST
ఒక్కొక్కణ్ణి కాదు షేర్‌ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించు అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా... ఈ డైలాగ్ లాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఎంతమంది కలిసి వచ్చినా రెడీ అంటారని అంతా అనుకున్నారు. ..
ఒక్కొక్కణ్ణి కాదు షేర్‌ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించు అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా... ఈ డైలాగ్ లాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఎంతమంది కలిసి వచ్చినా రెడీ అంటారని అంతా అనుకున్నారు. జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి పోటీ చేసినా సరే ఓడించి తీరుతానని ముందుకు వస్తారని అంతా అనుకున్నారు. కానీ.. తన పాలనపై తనకే నమ్మకం లేనట్లుంది. పైకి ఎన్ని మాటలు చెప్పినా.. తెనాలి ప్రజల సాక్షిగా తన మనసులోని మాటను బయటపెట్టేశారు. ఇన్నాళ్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న వైఎస్ జగన్, ఈసారి 175 గెలుచుకునేందుకు ఆరాటపడుతూ ఎమ్మెల్యేలకు (YSRCP MLAs) హితబోధ చేస్తుంటారు.. కానీ హఠాత్తుగా యుద్ధం ముందు కాడె కింద పడేశారు.
ఏంటో ఈ సవాల్..!
అవును... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన (TDP-Janasena) కలిసి పోటీ చేయబోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీకి (YSRCP) ఘోర పరాజయం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవు కాబట్టి ఓటమి తప్పదని జగన్‌కు ఫుల్ క్లారిటీగా అర్థమైపోయినట్లుంది. అందుకే.. ‘మీకు దమ్ముంటే కలిసికట్టుగా కాదు ఒంటరిగా ఒక్కొక్కరు 175 స్థానాల్లో పోటీ చేసి.. గెలవండి’ అంటూ సవాల్ విసిరారు. ‘నేను ఒంటరిగా వస్తా’ అని సవాల్ చేయటంలో తప్పులేదు... కానీ ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ (Challange) చేయడమేంటి..? ఓడిపోతానని తెలిసే ఇలా ఉల్టా సవాల్ (Reverse Challange) విసిరినట్లు ఓపెన్‌గా కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయటం వల్లే వైసీపీకి భారీ సీట్లు దక్కాయని, అతి తక్కువ ఓట్ల మెజారిటీతో చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహాంతోనే చంద్రబాబు-పవన్‌లు (Chandrababu- Pawan) కలవకుండా జగన్ తాపత్రయపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఫుల్ క్లారిటీగా..!
నిజానికి చంద్రబాబు-పవన్‌ను వైఎస్ జగనే (YS Jagan Mohan Reddy) కలిపారు. అవును... కాపు ఓటు బ్యాంకు (Vote Bank) కోసం పవన్‌ను తిట్టించి, చంద్రబాబును (Nara Chandrababu) పూర్తిగా అణచివేసే విధానాన్ని అవలంభించి జగనే ఆ ఇద్దరిని కలిపారనే కామెంట్స్ అప్పట్లో వచ్చాయి. మొత్తానికి చూస్తే.. తాను తవ్వుకున్న గొయ్యిలో తానే పడ్టట్లు... ఇప్పుడు అదే జగన్‌ను అధికారం నుంచి దించేందుకు కారణమయ్యేలా ఉందని గ్రహించి, విడివిడిగా పోటీ చేయాలంటూ కొత్త రాగం అందుకున్నట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ కామెంట్స్ విన్న సొంత పార్టీ నేతలే ఇలా మాట్లాడేశారేంటి..? అని అవాక్కయ్యారట.