CBN Arrest : వినాయక చవితి రోజున టీడీపీ ఆసక్తికర ట్వీట్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ
ABN , First Publish Date - 2023-09-18T19:02:31+05:30 IST
వినాయక చవితి.. హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి..
వినాయక చవితి.. హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు.. లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవిని ‘వినాయక చవితి’ (Vinayaka Chavithi) పండుగను హిందువులు జరుపుకుంటారు. విఘ్నాలకు అధిపతి అయిన వినాయక చవితిని వాడవాడలా జరుపుకుంటున్నారు. ఈ చవితి సందర్భంగా సినీ, రాజకీయ.. పలు రంగాల ప్రముఖులు.. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.. తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ చేసింది.
ఇంతకీ ఏమిటా ట్వీట్..?
ద్వాపరయుగం, కలియుగంకు తేడా చెబుతూ టీడీపీ ట్వీట్ చేసింది. నాడు శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న నిందలు.. నేడు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎదుర్కొంటున్న నిందలు ఇందులో రాసి ఉన్నాయి.
ద్వారపయుగం :-
శ్రీకృష్ణుడికే తప్పని నీలాపనిందలు :
శ్రీకృష్ణుడిపై శమంతకమణి దొంగలించాడనే అభియోగాన్ని విఘ్నేశ్వరుడు పూజ మహిమ ద్వారా ఆయన ఎలా బయటపడ్డారో అందరికీ తెలిసిందే. ఇందుకు శ్రీకృష్ణుడి ఫొటోను జతచేయడం జరిగింది.
కలియుగం :-
నేడు చంద్రబాబు గారిపై పడిన నీలాపనింద కూడా అటువంటిదే.. ఆ అపవాదు నుంచి నిర్దోషిగా, దుష్ట పాలకుల కుట్రల నుంచి బయటికి రావాలని మనం అందరం ఆ విఘ్ననాథుడిని కోరుకుందాం’ అని ట్వీట్‌లో టీడీపీ రాసుకొచ్చింది. దీనిపక్కనే టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోను టీడీపీ జతచేసింది.
ఇప్పుడిదే చర్చ
కాగా.. ఈ ట్వీట్‌ను వేలాది మంది చూడగా.. వందల మంది టీడీపీ వీరాభిమానులు, నెటిజన్లు రీట్వీట్ చేశారు. ఇక కామెంట్స్ అయితే చిత్రవిచిత్రాలుగా ఉన్నాయి. కొందరు కచ్చితంగా బాబు కుట్రల నుంచి బయటకొస్తారని చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ పోలికపై కొందరు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు కాసింత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ చూసినా ఈ ట్వీట్‌పైనే చర్చ జరుగుతోంది.