KCR Video Viral : మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్’ రైళ్ల గురించి కేసీఆర్ ఎన్నెన్ని మాటలు అన్నారో.. వీడియో వైరల్..
ABN , First Publish Date - 2023-04-08T17:27:58+05:30 IST
కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా ఈ రైళ్లు తిరుగుతున్నాయి...
కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా ఈ రైళ్లు తిరుగుతున్నాయి. అయితే రైళ్ల ఛార్జీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కానీ.. కొందరైతే దీన్ని మెచ్చుకుంటున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘వందేభారత్’ గురించే చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు కూడా సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఇంత ప్రతిష్టాత్మకంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ రైలు గురించి ప్రజలంతా చర్చించుకుంటుండగా.. గతనెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి..? అంతగా వైరల్ అయ్యేలా..? కేసీఆర్ ఏం మాట్లాడారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఇంతకీ కేసీఆర్ ఏమన్నారో..!
ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో రైల్వే వ్యవస్థ ఎలా ఉంది..? ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందనే దాని గురించి అసెంబ్లీ వేదికగా ఎంతవేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నాయో కేసీఆర్.. లెక్కలు తీసి మరీ చెప్పారు. ఈ సందర్భంగా వందేభారత్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. ‘ అధ్యక్షా.. చెప్పుకుంటే సిగ్గుపోతది.. ఒకటే ఒక వందేభారత్ రైలు పెట్టారు.. అంతకుముందు శతాబ్ది, రాజధాని అని చాలా ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాయి. ఎప్పుడూ, ఎక్కడా ప్రధాన మంత్రులు రైళ్లను ప్రారంభించలేదు.. ఏదైనా ఒకట్రెండు సందర్భాల్లో తప్ప.. పనిగట్టుకుని వచ్చి మాత్రం చేయరు. ఒక్క వందేభారత్ రైలు అని పెడితే.. దానికి బర్రె గుద్దినప్పుడల్లా పచ్చడి, పచ్చడి అవుతోంది. అదేం ఖర్మో తెలియట్లేదు కానీ.. బర్రెలకు దానిమీద ప్రేమనో.. (నవ్వుతూ) దాని సంగతి ఏంటో అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో కూడా ఎవరికీ తెలియదు. ఆ గొప్పతనానికి ఎన్నిసార్లు ప్రధాని వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు..?. నేను లెక్క కడుతూనే ఉన్నా ఇప్పటికే 14 సార్లు మోదీ ప్రారంభించారు. ఇంతకన్నా ఘోరం, అన్యాయం ఎక్కడైనా ఉంటుందా..?. ఉండేది ఒకే ఒక్క రైలు పెద్ద గొప్పగా ఏమీ లేదు.. అంతకంటే రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.. అవన్నీ నడుస్తూనే ఉన్నాయ్.. ఇందులో కొత్త కథేం లేదు. దీనికే 14 సార్లు చేసి.. మొన్న మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ప్రారంభిస్తాం అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తూక్‌పాలి చేసి ముఖం కడిగి పౌడర్ వేసుకున్నట్లు.. గీ ఇంత పనికి మోదీ రావాలా..?. కేంద్రమంత్రి వచ్చి లిఫ్ట్ ప్రారంభించడమేంటి..? అది కూడా ఆ లిఫ్ట్‌ను జాతికి అంకితం చేయడమేంటో..? (పడిపడి నవ్విన శాసన సభ్యులు). ఇదేం పద్ధతి. దేశం అంటే ఎలా ఉండాలి.. పద్ధతి ఎలా ఉండాలి..? జనాలకు ఎంత మేథస్సు ఉండాలి..? ఇవన్నీ వాస్తవాలు అధ్యక్షా. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిపోయింది’ అని అసెంబ్లీ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
నవ్వులే.. నవ్వులు..!
వందేభారత్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు స్పీకర్ మొదలుకుని శాసన సభ్యుల వరకూ అందరూ ఒకటే నవ్వులు. ఇక కేసీఆర్ పంచ్‌లతో కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా బల్లలు చరిచి మరీ నవ్వేసుకున్నారు. ఇవాళ మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రావడం, వందేభారత్‌ను ప్రారంభించడంతో కేసీఆర్ పాత వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పెద్ద ఎత్తున ట్విట్టర్ (Twitter) , ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పెద్ద ఎత్తున వీడియోలు (Videos) , మీమ్స్ (Memes) వైరల్ అవుతున్నాయి. ఇక కామెంట్స్ అయితే లెక్కే లేదు. వాస్తవానికి.. దేశంలో చాలా చోట్ల బర్రెలు ఢీ కొనడంతో రైలు ముందుభాగం చెల్లాచెదురైన సందర్భాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో ఇవే రైళ్లపై రాళ్లదాడి కూడా జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయ్. ఈ విమర్శలపై బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి మరి.