Software Engineers: రాత్రి ఫుల్లుగా మందు పార్టీ.. పొద్దునే నిద్రలేచి ఫోన్‌లో మెసేజ్ చూసుకున్న 15 మంది ఉద్యోగులకు షాక్..!

ABN , First Publish Date - 2023-05-06T16:16:07+05:30 IST

తూ ఉంటాయి. అది కూడా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీనే. చాలా గ్రాండ్‌గా ఉద్యోగులకు పార్టీ ఏర్పాటు చేసింది. ఈ వార్త తెలిసి ఉద్యోగులు ఎంతో సంబరపడ్డారు. కానీ అసలు విషయం తెలిశాక

Software Engineers: రాత్రి ఫుల్లుగా మందు పార్టీ.. పొద్దునే నిద్రలేచి ఫోన్‌లో మెసేజ్ చూసుకున్న 15 మంది ఉద్యోగులకు షాక్..!
Software Engineers

ఏ కంపెనీ అయినా లాభాల్లో ఉంటే ఎంప్లాయిస్‌కు బోనస్‌లు ఇవ్వడమో.. లేదంటే గిఫ్ట్‌లు ఇవ్వడమో జరుగుతుంటాయి. అంతకీ లేదంటే ఏ పార్టీ ఇవ్వడమో చేస్తుంటాయి. ఇలా ఆయా కంపెనీల్లో సహజంగా జరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో లేదంటే సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇలాంటివి విరివిగా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీనే. చాలా గ్రాండ్‌గా ఉద్యోగులకు పార్టీ ఏర్పాటు చేసింది. ఈ వార్త తెలిసి ఉద్యోగులు ఎంతో సంబరపడ్డారు. కానీ అసలు విషయం తెలిశాక వారంతా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏమైంది? ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన ఈ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

‘పొమ్మనలేక పొగపెట్టడమంటే ఇదేనేమో’ ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఎందుకు వినుండరు. అనేక సార్లు ఆయా సందర్భాల్లో ఉపయోగిస్తూనే ఉంటారు. అచ్చం అలాగే చేసింది ఓ కంపెనీ.

అమెరికాలోని అరిజోనా కేంద్రంగా పనిచేస్తున్న బిషప్‌ ఫాక్స్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ (Cybersecurity) తన కంపెనీ ఉద్యోగులకు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీలో సైబర్‌ సూప్‌ పేరుతో కంపెనీ ఖరీదైన మద్యం సరఫరా చేసింది. పార్టీలో (party) ఉద్యోగులంతా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఫుల్‌ జోష్‌లో ఉన్న ఉద్యోగులకు తెల్లారి మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యారు.

కొన్ని గంటల వ్యవధిలోనే 13 శాతం (13 per cent) మంది ఉద్యోగులను (Software Engineers) తొలస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ముందురోజు రాత్రి పార్టీని బాగా ఎంజాయ్‌ చేసిన ఉద్యోగులు తెల్లారి కంపెనీ ప్రకటన విని షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ.. కంపెనీ నిర్ణయాన్ని అసలు ఊహించలేకపోయినట్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనడంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బిషప్‌ ఫాక్స్‌ సీఈవో తెలిపారు. ప్రస్తుతం సంస్థ వ్యాపారం సజావుగానే సాగుతోందని, సాంకేతిక రంగంలో కంపెనీ ప్రస్తుతం నమోదు చేస్తున్న గణాంకాలను మరింత మెరుగుపర్చనున్నట్లు వెల్లడించారు. కంపెనీలో మొత్తం 400 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 50 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. పాపం ఉద్యోగులు.. మత్తులో నుంచీ తేరుకునేలోపే షాకింగ్ నిర్ణయం తీసుకుని కంపెనీ ఝలక్ ఇచ్చింది.

party.jpg

Updated Date - 2023-05-06T16:17:31+05:30 IST