Viral Video: ఇది స్కూటీ కాదమ్మాయ్.. బుల్లెట్ బండి.. కిక్ కొట్టడం అంత ఈజీ కాదంటూ నెట్టింట సెటైర్లు.. ఇంతకీ అసలేమైందంటే..!
ABN , First Publish Date - 2023-09-20T20:51:26+05:30 IST
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఎలాగో.. అలాగే విధిగా బైకూ ఉండడం కామన్ అయిపోయింది. యువకులతో సమానంగా యువతులు కూడా స్కూటీలు నడపడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు డ్రైవింగ్‌పై అవగాహన లేకున్నా కూడా బండి తీసుకుని రోడ్లపైకి వస్తుంటారు. ఈ క్రమంలో ...
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఎలాగో.. అలాగే విధిగా బైకూ ఉండడం కామన్ అయిపోయింది. యువకులతో సమానంగా యువతులు కూడా స్కూటీలు నడపడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు డ్రైవింగ్‌పై అవగాహన లేకున్నా కూడా బండి తీసుకుని రోడ్లపైకి వస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంకొందరైతే కనీస అవగాహన కూడా లేకుండా బండ్లు నడుపుతుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలిక బుల్లెట్ బండిని స్టార్ట్ చేయాలని చూసింది. అయితే చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక బుల్లెట్ బండిని (girl trying to start bullet bike) స్టార్ట్ చేయాలని చూస్తుంది. ‘‘అదేమైనా బ్రహ్మ విద్యా.. స్కూటీ మాదిరే కదా’’.. అని అనుకుంటూ బుల్లెట్ బైకు వద్దకు వెళ్తుంది. తాళాలు పెట్టి ఆన్ చేసి, బండిని కిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఒకసారి కిక్ కొట్టిన సమయంలో బండి స్టార్ట్ అవదు. దీంతో మళ్లీ రెండో సారి కిక్ కొట్టేందుకు (kick start) గట్టిగా ప్రయత్నిస్తుంది. ఊపిరి గట్టిగా తీసుకుని.. శక్తినంతా ఉపయోగించి కిక్ కొడుతుంది. కాలితో కిక్ రాడ్‌ను ఇలా గట్టిగా కిందకు తొక్కగానే.. అంతే వేగంగా పైకి వస్తుంది.
Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఈ పిల్లల వీడియోను చూస్తే.. గతం గుర్తుకు రావడం ఖాయం..!
బైక్ కిక్ రాడ్ కాలికి గట్టిగా తగలడంతో విపరీతమైన నొప్పి పుడుతుంది. ‘‘వామ్మో! నా కాలు’’.. అని అనుకుంటూ పక్కకు వెళ్లి ఏడుపు అందుకుంటుంది. ‘‘బుద్ధి ఉంటే ఇంకోసారి బుల్లెట్ బండిని స్టార్ట్ చేయకూడదు’’.. అని అనుకుంటూ నొప్పి తగ్గే వరకూ అక్కడే కూర్చుండిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఏవమ్మా.. అదేమైనా స్కూటీ అనుకున్నావా’’.. అని కొందరు, ‘‘అయ్యో! ఎంత పని జరిగింది.. కాస్త చూసుకోవాలి కదా’’.. అని మరికొందరు, ‘‘అవగాహన లేకుండా ఇలాంటి పనులు చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.