Manchu Manoj Mounika Marriage : మంచు మనోజ్-మౌనిక లవ్ మ్యారేజీకి ఆ ఒక్కటే కారణమా.. అందుకే హీరో ఫిదా అయిపోయాడా..?
ABN , First Publish Date - 2023-03-05T20:06:57+05:30 IST
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి (Manchu Manoj- Mounika Marriage) ఇటీవల వేద మంత్రాల నడుమ, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి (Manchu Manoj- Mounika Marriage) ఇటీవల వేద మంత్రాల నడుమ, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సోషల్ మీడియాలో (Social Media) మనోజ్, మౌనిక పెళ్లి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు మీడియాలోనూ ఇప్పుడంతా ఈ జంట గురించే చర్చ నడుస్తోంది. అసలు వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు..? పెళ్లి దాకా ఎలా వచ్చారు..? వీరిద్దరూ ప్రేమలో (Love) పడటానికి కారణం ఏమై ఉంటుంది..? అనే విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకే ఒక్క విషయంతో ఇద్దరి మనసులు కలిశాయని.. అదే మనోజ్-మౌనికను ఏడడుగులు దాకా నడిపిచిందని తాజాగా నెట్టింట్లో ఓ ప్రచారం జరుగుతోంది.
ఇలా కలిశారా..?
హీరో మంచు మనోజ్‌కు 2015 లోనే ప్రణతితో (Manoj-Pranathi) వివాహం జరిగింది. కొన్ని విషయాల్లో మనస్పర్థలు రావడం వల్ల 2019 అక్టోబర్ 17న మనోజ్, ప్రణతి వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఇక భూమా మౌనిక విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. రెండేళ్ల క్రితేమే ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే.. 2016లో భూమా మౌనిక (Bhuma Mounika) నిశ్చితార్థ వేడుక, పెళ్లికి కూడా మంచు మనోజ్‌తో పాటు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అలా నిశ్చితార్థం (Bhuma Mounika Engagement), పెళ్లికి అతిథిగా వెళ్లిన మనోజ్.. ఆయనే తాళి కట్టే రోజొకటి వస్తుందని ఆ సమయంలో ఏ ఒక్కరికీ ఊహించి ఉండరేమో. రాజకీయ నేపథ్యం ఉన్న భూమా కుటుంబానికి.. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న మంచు కుటుంబానికి ఎప్పట్నుంచో మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయట. ఈ క్రమంలోనే మనోజ్, మౌనిక ఇద్దరూ మంచి స్నేహితులయ్యారట. ఇద్దరికీ పెళ్లయిన తర్వాత.. విడాకుల తర్వాత కూడా అదే స్నేహం కొనసాగిందట. ఒక్కసారిగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర కనిపించడంతో ఇద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ నిజమే అయ్యాయి. ఇద్దరూ ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.
అప్పట్లో మనోజ్ ఇలా..!
మనోజ్, మౌనికలో (Manoj, Mounika) ఒక కామన్ పాయింట్‌తో ఇద్దరి మధ్య ఇష్టం మరింత పెరిగిందనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. మనోజ్‌కు మొదట్నుంచీ సేవా దృక్పథం ఎక్కువే. తనకు ఫలానా సాయం కావాలని ఎవరైనా ఆయన్ను సంప్రదిస్తే కచ్చితంగా చేసేవారనే మంచు హీరోకు మంచి పేరుంది. ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఎంతో మందికి తన వంతుగా సాయం చేయడం.. లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌లోనే (Hyderabad) ఉండిపోయిన ఎంతో మంది కూలీలు, సామాన్య ప్రజలను వారి స్వగ్రామాలకు తరలించారు. ఇదంతా తన సొంత డబ్బులతోనే మనోజ్ చేశారు. అప్పట్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్‌తో (Sonusood) ఈయన్ను పోల్చుతూ.. టాలీవుడ్‌లోనూ సోనూసూద్ ఉన్నాడని ప్రశంసల్లో ముంచెత్తారు కూడా. అంతేకాదు.. చిత్తూరు జిల్లాలో 10 గ్రామాలను మంచు ఫ్యామిలీ దత్తత కూడా తీసుకుంది.
మారు మాట ఉండదట..!
ఇక మౌనిక విషయానికొస్తే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల (Nandyal), ఆళ్లగడ్డ (Allagadda) నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి (Bhuma Family) మంచి పేరుంది. శోభా నాగిరెడ్డి (Shobha Nagireddy), భూమా నాగిరెడ్డి (Bhuma Nagi Reddy) అకాల మరణం తర్వాత కుటుంబానికి అన్నీ తానై మౌనిక చూసుకున్నారని అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు.. కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలన్నీ మౌనికానే చూసుకునేవారట. నాటికి నేటికి బిజినెస్ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా మౌనికనే ఫైనల్ అట. వీటితో పాటు ప్రజా సేవ చేయడం అంటే మౌనికకు బాగా ఇష్టమని భూమా అనుచరులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. 2017లో ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో (Nandyal By Election) తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి (Bhuma Brahmananda Reddy) గెలుపులో మౌనిక పాత్రే ముఖ్యం. అప్పట్లో ఛానెల్స్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు, స్పీచ్‌ను చూసి రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఆకాంక్షించారు. మరీ ముఖ్యంగా.. తనకు కష్టమొచ్చిందని ఇంటి తలుపు తడితే మారుమాట చెప్పకుండా సాయం చేసేవారని కార్యకర్తలు చెబుతుంటారు. మౌనికను సాయం అడిగితే కాదనకుండా చేస్తారని ఆళ్లగడ్డ, నంద్యాలలోని అభిమానులకు గట్టి నమ్మకమట.
ఇదే కామన్ పాయింట్..!
స్నేహానికి (Friendship) మౌనిక ఇచ్చే విలువ, కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసే గుణం, మనోస్థైర్యం ఇవన్నీ మనోజ్‌కు నచ్చి ఫిదా అయిపోయారట. అందుకే ఫ్రెండ్స్ కాస్త ప్రేమలో పడ్డారని.. ఆ తర్వాత పెళ్లితో (Marriage) ఒక్కటయ్యారట. సేవా దృక్పథం ఉన్న ఈ ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వడంతో మంచు, భూమా వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారట. ఇకపైనా ఇద్దరూ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు.. రాజకీయం పట్ల మౌనికకు చాలా ఆసక్తే ఉంది.. బలమైన రాజకీయ వారసత్వానికి ఇప్పుడు మంచు ఫ్యామిలీ (Manchu Family) కూడా తోడయ్యింది. రానున్న రోజుల్లో మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా రావొచ్చని అనుచరులు చెప్పుకుంటున్నారు.. ఏం జరుగుతుందో చూద్దాం మరి.