LIC: ఎల్ఐసీలో అద్భుతమైన ప్లాన్... ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.12 వేల వరకు ఆదాయం.. ఇందుకోసం చేయాల్సిందల్లా...
ABN , First Publish Date - 2023-06-11T19:51:25+05:30 IST
ఈ ప్లాన్‌లో నెలకు రూ.12000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లింపుతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఆ తర్వాత 60 ఏళ్లపాటు నెలకు రూ.12 వేల ఆదాయం పొందొచ్చు. 60 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే వార్షిక లాభం రూ.58,950గాఉంది. కాగా ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగా పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చక్కటి స్కీమ్స్ అందిస్తుంటుంది. అలాంటి ప్లాన్స్‌లో ఒకటే ‘ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్’ (LIC Saral pension plan). ఈ ప్లాన్‌లో పాలసీదారులు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా రూ.12 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మరి ప్రయోజనకరమైన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం...
ఎల్ఐసీ జీవన్ సరల్ పాలసీ అనేది ఒక ఎండోమెంట్ ప్లాన్. అంటే ఈ ప్లాన్‌లో మనీ సేవింగ్స్‌తోపాటు పాలసీదారులకు రక్షణ కూడా అందిస్తుంది. ట్యాక్స్ సేవింగ్స్ (Tax savings), లోన్ సౌలభ్యాలు (Loan facility) లభిస్తాయి. ఒకవేళ ఈ ప్లాన్ టర్మ్ సమయంలో పాలసీదారుడు మరణిస్తే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. చెల్లించిన ప్రీమియం ఆధారంగా డెత్ బెనిఫిట్స్ ఉంటాయి. వయసు ఆధారంగా మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్‌ను (Maturity sum Assured) పాలసీ టర్మ్ చివరిలో చెల్లిస్తారు. ఈ ప్లాన్‌లో నెలకు రూ.12000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లింపుతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఆ తర్వాత 60 ఏళ్లపాటు నెలకు రూ.12 వేల ఆదాయం పొందొచ్చు. 60 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే వార్షిక లాభం రూ.58,950గాఉంది. కాగా ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగా పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
ఇక ప్రీమియం విషయానికి వస్తే ఒక ఏడాది, 6 నెలలు, 3 నెలలు లేదా నెలవారీగా పాలసీదారులు తమకు అనువైన ప్రీమియంను ఎంచుకోవచ్చు. శాలరీ నుంచి కట్ అయ్యేలా కూడా ఆప్షన్ ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ లేదా డెత్ వరకు ప్లాన్‌ను ఎంపికచేసుకోవచ్చు. ఒక సింగిల్ పేమెంట్ సంపూర్ణ రిఫండ్‌తో లైఫ్ యాన్యుటీ లభిస్తుంది. ఈ పాలసీకి ఒక వ్యక్తిని లింక్ చేయవచ్చు. పెట్టుబడిదారుడు లేదా పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం పెన్షన్ చెల్లింపులు అందుతాయి. ఒకవేళ పెట్టుబడిదారుడు చనిపోతే నామినీకి బేస్ ప్రీమియం అందుతుంది.
ఎల్ఐసీ జీవన్ సరల్ పాలసీ ఫీచర్స్, బెనిఫిట్స్ ఇవే...
- అడిషనల్ రైడర్స్
- ప్రీమియం
- లాయల్టీ బెనిఫిట్స్
- యాక్సిడెంటల్ డెత్, డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్
- మెచ్యూరిటీ బెనిఫిట్
- స్పెషల్ సరెండర్స్.