MS Dhoni: విమానంలో కూర్చుని నిద్రపోతున్న ధోనీ.. ఆ ఎయిర్ హోస్టెస్ చేసిన పనిపై మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-07-31T16:37:00+05:30 IST

మహేంద్ర సింగ్ ధోనీ అంటూ కేవలం ఓ క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక నాయకుడు. అందుకే ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించినా అతడిని అభిమానించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

MS Dhoni: విమానంలో కూర్చుని నిద్రపోతున్న ధోనీ.. ఆ ఎయిర్ హోస్టెస్ చేసిన పనిపై మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే..

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంటే కేవలం ఓ క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక నాయకుడు. అందుకే ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించినా అతడిని అభిమానించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. క్రికెట్ ఆటగాళ్లు సైతం ధోనీని అభిమానిస్తారు. సాధారణ ప్రేక్షకుల గురించైతే చెప్పనక్కర్లేదు. అతడితో ఫొటోలు తీసుకోవడం కోసం ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తారు (Viral News).

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఇటీవల ధోనీ తన భార్య సాక్షితో కలిసి విమాన ప్రయాణం చేశారు. విమానంలో ధోనీని చూసిన ఎయిర్ హోస్టెస్ సంతోషానికి అంతులేకుండా పోయింది. విమానంలో తన సీట్లో కూర్చుని ధోనీ నిద్రపోతున్న సమయంలో ఆ ఎయిర్ హోస్టెస్ వీడియో తీసింది (Dhoni sleeping in the flight). ``ధోనీ ఇక్కడే ఉన్నారు.. చూడండి`` అంటూ ఆమె ఎంతో ఉత్సాహంగా చెబుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంత మంది ఆ వీడియోను లైక్ చేశారు.

Viral: అమితాబ్ బచ్చన్ అభిమాని.. నేపాల్‌లోనే అత్యంత ధనవంతుడు.. అతడి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవడం ఖాయం!

ఆ ఎయిర్ హోస్టెస్ (Air Hostess) చేసిన పనిపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. ``ఇది ధోనీ, సాక్షిల ప్రైవసీపై దాడి``, ``ఇది చాలా తప్పు``, ``కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆమెకు ఎవరైనా చెప్పండి``, ``ఇతరుల గోప్యతకు భంగం కలగించకుండా మెలగడం ఎలాగో ఆమె నేర్చుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-31T16:37:00+05:30 IST