Metro Train Video: బాబోయ్.. ఇదేం అరాచకం.. ఈ యువతి డ్రస్సు వేసుకుపోవడం మర్చిపోయి మెట్రో రైల్ ఎక్కిందా ఏంటి..? నెటిజన్ల ఘాటు కామెంట్స్..!

ABN , First Publish Date - 2023-04-02T16:41:12+05:30 IST

ప్రస్తుతం ట్రెండ్ పేరుతో యువతీయువకులు చిత్రవిచిత్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. యువకులతో పోటీ పడి యువతులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అందులోనూ సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండడంతో ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు..

 Metro Train Video: బాబోయ్.. ఇదేం అరాచకం.. ఈ యువతి డ్రస్సు వేసుకుపోవడం మర్చిపోయి మెట్రో రైల్ ఎక్కిందా ఏంటి..? నెటిజన్ల ఘాటు కామెంట్స్..!

ప్రస్తుతం ట్రెండ్ పేరుతో యువతీయువకులు చిత్రవిచిత్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. యువకులతో పోటీ పడి యువతులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అందులోనూ సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండడంతో ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు యువతులైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. మెట్రో రైల్లో యువతి వేష ధారణ చూసి అంతా అవాక్కవుతున్నారు. బాబోయ్.. ఇదేం అరాచకం.. ఈ యువతి డ్రస్సు వేసుకుపోవడం మర్చిపోయి మెట్రో రైల్ ఎక్కిందా ఏంటి..?.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముంబై మెట్రో రైల్లో (Mumbai metro train) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి లగేజీ బ్యాగు మీద పెట్టుకుని రైల్లో కూర్చుని ఉంటుంది. పక్కనే మరికొందరు యువతులు కూడా కూర్చుని ఉంటారు. ఇందులో ఎలాంటి విశేషం లేదు, సమస్యా లేదు. అయితే కాసేపటి తర్వాత ప్రయాణికులంతా షాక్ అయ్యే దృశ్యం కనిపించింది. బ్యాగు మీద పెట్టుకుని కూర్చున్న యువతి (young woman) .. తాను దిగే స్టేషన్ రాగానే పైకి లేచింది. బ్యాగు పక్కకు తీయగానే... అర్ధనగ్నంగా (Indecent dressing) కనిపించిన యువతిని చూసి ప్రయాణికులంతా షాక్ అయ్యారు.

Viral Video: ముందో యువతి, వెనుకో యువతి.. బైకుపై వెళ్తూ రాత్రి వేళ, నడి రోడ్డుపై ఇతడు చేసిన నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు..

చిన్న చిన్న పేలికలు మాత్రమే ధరించి, శరీరం మొత్తం కనిపించేలా ఉన్న ఆమె వస్త్రధారణను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ యువతి పక్కనే మాస్కు పెట్టుకుని ఉన్న మరో యువతి.. ‘‘ ఈ డ్రెస్సేంటో.. ఈ పిచ్చేంటో’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ యువతి డ్రస్సు వేసుకోవడమే మర్చిపోయినట్లుంది.. అని కొందరు, రోజురోజుకూ కొందరు మరీ దారుణంగా తయారువుతున్నారు.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-02T16:41:12+05:30 IST