SSMB28: పూజ హెగ్డే సెట్లో అడుగు పెట్టింది

ABN , First Publish Date - 2023-02-06T13:46:47+05:30 IST

SSMB28 సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.

SSMB28: పూజ హెగ్డే సెట్లో అడుగు పెట్టింది

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలెట్టిన దగ్గర నుంచీ ఏవో అవాంతరాలు వస్తూనే వున్నా, మొత్తానికి కొత్త సంవత్సరం లో షూటింగ్ అంతరాయం లేకుండా జరుగుతోంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఈ సినిమాలో (#SSMB28) కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.

pooja-ssmb.jpg

ఇదే మొదటి సారి పూజ హెగ్డే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనటం. ఇందులో శ్రీ లీల (Sreeleela) కూడా ఇంకో కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె మహేష్ బాబు (#SSMB28) మరదలు రోల్ వేస్తోంది అని ఒక భోగట్టా వినిపిస్తోంది. పూజ హెగ్డే నే మెయిన్ కథానాయిక అని, శ్రీ లీల కి వచ్చిన పాపులారిటీ ని బట్టి ఆమెని ఈ సినిమాలో తీసుకున్నారని కూడా తెలుస్తోంది. ఇవాళ సోమవారం కూడా అదే ప్రైవేట్ ఆసుపత్రి లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.

pooja-ssmb2.jpg

ఆ తరువాత ఒక వారం రోజుల పాటు మహేష్ లేకుండా వున్న సన్నివేశాలు కొన్ని దర్శకుడు త్రివిక్రమ్ చిత్రీకరించ నున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియన్ నటులు వున్నట్టుగా కూడా తెలిసింది. ప్రకాష్ రాజ్ (Prakash Raj) మహేష్ బాబు కి తాత గా ఇందులో కనిపించనున్నట్టు అనుకుంటున్నారు. హీరో మహేష్ బాబు ఇంటి సెట్ కూడా ఒకటి తయారవుతోందని అందులో ఇంక షూటింగ్ మొదలెడతారని కూడా తెలిసింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-06T13:46:48+05:30 IST

News Hub