Viral Video: ఉన్నట్టుండి పెళ్లికి ముందు వీడియో ప్రదర్శించగానే అవాక్కైన వధువు.. పెళ్లి మంటపంలో బిగ్ స్క్రీన్‌పై అంతా చూస్తుండగా..

ABN , First Publish Date - 2023-04-02T20:41:34+05:30 IST

వివాహ కార్యక్రమాల నిర్వహణలో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుత టెక్నాలజీ ఎఫెక్ట్ పెళ్లిళ్లపై కూడా పడుతోంది. అందులోనూ సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో వివాహ కార్యక్రమాలను కూడా..

Viral Video: ఉన్నట్టుండి పెళ్లికి ముందు వీడియో ప్రదర్శించగానే అవాక్కైన వధువు.. పెళ్లి మంటపంలో బిగ్ స్క్రీన్‌పై అంతా చూస్తుండగా..

వివాహ కార్యక్రమాల నిర్వహణలో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుత టెక్నాలజీ ఎఫెక్ట్ పెళ్లిళ్లపై కూడా పడుతోంది. అందులోనూ సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో వివాహ కార్యక్రమాలను కూడా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కార్యక్రమంలోని ప్రతి ఘట్టాన్నీ సినిమా తరహాలో రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ వెడ్డింగ్ షూట్‌ మొదలుకొని మంటపంలోకి వధూవరుల ఎంట్రీ, డీజే పాటలకు డాన్సులు.. ఇలా ప్రతి కార్యక్రమాన్నీ వెరైటీగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియో వైరల్‌గా (bride and groom Viral videos) మారింది. ఓ వివాహ కార్యక్రమంలో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేదిక వద్ద వధూవరులు సంతోషంగా ఉంటారు. అదే సమయంలో అక్కడే ఉన్న బిగ్ స్క్రీన్‌పై వారి వివాహానికి ముందు చిత్రీకరించిన ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన వీడియో ప్లే అవుతుంది. దీంతో అంతా వారి వారి ఫోన్లు (Phones) బయటికి తీసి రికార్డు చేసుకుంటూ ఉంటారు. వధూవరులు కూడా అందరితో పాటూ వారి వీడియోను ఆసక్తిగా చూస్తూ ఉంటారు.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

అయితే ఇంతలో వీడియోలో వధూవరులు కిస్ చేసుకున్న సన్నివేశం (kiss scene) వస్తుంది. ఆ సన్నివేశం చూడగానే అక్కడున్న వారంతా ఒకింత ఇబ్బందిగా ఫీలవుతారు. వరుడు కూడా తల దించుకుని బిడియంతో ఉంటాడు. ఇక కిస్ సీన్ చూసిన వధువు.. అందరి ముందూ సిగ్గుతో బిక్కమొఖం వేస్తుంది. ‘‘ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేయకుండా ఉండుంటే బాగుండు’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. మరోవైపు అక్కడున్న అతిథులంతా వీడియోను రికార్డు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Love Holidays: ప్రేమించుకునేందుకు విద్యార్థులకు సెలవులు.. వారం రోజుల పాటు ఎంజాయ్ చేయండంటూ.. సూచనలు ఇచ్చి మరీ..


kurnool: వామ్మో.. కర్నూల్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

రష్మిక, తమన్నా డ్రెస్సింగ్ చూసి.. వాట్ ఏ డ్రెస్సింగ్ అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఫొటోలు వైరల్..!


Updated Date - 2023-04-03T08:34:34+05:30 IST