Viral Video: ఇతడి తెలివితేటలు చూస్తే.. ఇలాక్కూడా డబ్బు సంపాదించవచ్చా.. అని మీరే అంటారు..

ABN , First Publish Date - 2023-09-02T19:54:45+05:30 IST

డబ్బు సంపాదించాలన్న కోరిక, ఆశయం బలంగా ఉండాలే గానీ మన కళ్ల ముందు ఎన్నో మార్గాలు ఉంటాయి. కొందరు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఆదాయ మార్గాలను సృష్టించుకుంటుంటారు. మరికొందరు ఎదుటి వారికి తమ అవసరాన్ని సృష్టించి మరీ ఆదాయం పొందుతుంటారు. ఇంకొందరి తెలివితేటలు చూస్తే..

Viral Video: ఇతడి తెలివితేటలు చూస్తే.. ఇలాక్కూడా డబ్బు సంపాదించవచ్చా.. అని మీరే అంటారు..

డబ్బు సంపాదించాలన్న కోరిక, ఆశయం బలంగా ఉండాలే గానీ మన కళ్ల ముందు ఎన్నో మార్గాలు ఉంటాయి. కొందరు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఆదాయ మార్గాలను సృష్టించుకుంటుంటారు. మరికొందరు ఎదుటి వారికి తమ అవసరాన్ని సృష్టించి మరీ ఆదాయం పొందుతుంటారు. ఇంకొందరి తెలివితేటలు చూస్తే.. ‘‘అరే!.. ఇలాక్కూడా డబ్బు సంపాదించవచ్చా’’.. అని అనిపిస్తుంటుంది. ఇందుకు ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే నిదర్శనం. రోడ్డు దాటిస్తూ కూడా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి తెలివితేటలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. సాధారణంగా వర్షాలు మొదలైన కొత్తలో (rainy season) ఎవరైనా సరదాగా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే రోజూ వర్షాలు పడుతుంటే చివరకు చికాకు పుడుతుంటుంది. రోడ్లపై పారుతున్న వర్షపు నీరు, పొంగుతున్న నాలాలు.. వెరసి కాలు బయట పెట్టాలంటేనే చిరాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఓ వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకుని తద్వారా ఆదాయం పొందాలని ప్రయత్నించాడు. ఇందుకోసం నాలుగు చక్రాలతో ఓ చెక్క వాహనాన్ని (four wheeled wooden vehicle) తయారు చేసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి ప్రధాన రహదారి వద్ద ఉంచాడు.

Viral Video: రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న ఈ మహిళ.. సడన్ గా వైరల్ అవడం వెనుక..!

రోడ్డుపై వర్షపు నీరు పారుతున్న ప్రాంతంలో అడుగు పెట్టేందుకు ఇబ్బంది పడే వాళ్లను తన వాహనంపై ఎక్కించి రోడ్డు దాటిస్తున్నాడు. ఇలా పాదచారులను రోడ్డుకు అటువైపు, ఇటువైపు దింపుతూ.. చివరగా వారి నుంచి కొంత మొత్తాన్ని చార్జి చేస్తున్నాడు. కాళ్లు తడవకుండా రోడ్డు దాటాలని అనుకునే వారంతా ఇతడి వాహనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు ఈ వ్యక్తి వాహనాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వాహ్వా! నీ ఐడియా సూపర్ బ్రదర్’’.. అని కొందరు, ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో’’.. అని మరికొందరు, ‘‘ఇతడు పెద్ద వ్యాపారవేత్త అవడం ఖాయం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-02T19:55:52+05:30 IST