Share News

IND vs SA: కోతి కరవడం వల్లే రింకూ వేగంగా పరిగెత్తుతున్నాడు.. గిల్ ఎంత అల్లరోడో చూడండి.

ABN , First Publish Date - 2023-12-10T13:47:02+05:30 IST

Shubman Gill-Rinku Singh: ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారిపోయాడు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు రాబడుతూ జట్టుకు ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా గెలవడంలో రింకూ సింగ్ కీలకపాత్ర పోషించాడు.

IND vs SA: కోతి కరవడం వల్లే రింకూ వేగంగా పరిగెత్తుతున్నాడు.. గిల్ ఎంత అల్లరోడో చూడండి.

ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారిపోయాడు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు రాబడుతూ జట్టుకు ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా గెలవడంలో రింకూ సింగ్ కీలకపాత్ర పోషించాడు. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో వన్డే, టీ20 జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం సఫారీ పర్యటనకు రింకూ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ మాట్లాడాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, తన ఫిట్‌నెస్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ చేసిన ఓ చిలిపిపని నవ్వులు పూయించింది. అసలు ఏం జరిగిందంటే.. బీసీసీఐ ఇంటర్వూలో రింకూ సింగ్ తన ఫిట్‌నెస్ గురించి సీరియస్‌గా మాట్లాడుతున్నాడు.


ఈ క్రమంలో సడంగా వచ్చిన శుభ్‌మన్ గిల్.. కోతి కరవడం వల్లనే రింకూ సింగ్ వేగంగా పరిగెత్తుతున్నాడని చెప్పాడు. "బందర్ కతా హై ఇసిలియే తేజ్ భగ్తా హై (కోతి కరిచినప్పటి నుంచి అతను వేగంగా పరిగెత్తుతున్నాడు)" అని గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్ ఒక్కసారిగా పక పక నవ్వుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ నవ్వేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ చాలా అల్లరోడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రింకూ సింగ్ ఇంకా ఏం అన్నాడంటే.. ‘‘నేను ఈ రోజు ఇక్కడ బ్యాటింగ్ చేసినప్పుడు భారత్‌లోని వికెట్లతో పోలిస్తే అదనపు బౌన్స్ కనిపించింది. పేస్ ఎక్కువగా ఉంది. కాబట్టి పేస్ బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేశాం. మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో మంచి వాతావరణం ఉంది.

నేను చాలా ఆనందించాను. రాహుల్ ద్రావిడ్ సర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం మంచి అనుభూతిని కల్గించింది. నన్ను నా సహజశైలిలోనే ఆడమని, ఆత్మవిశ్వాసంతో ఉండమని చెప్పారు. నంబర్ 5 లేదా 6లో ఆడడం కొనసాగించమని తెలిపారు. ఆ స్థానంలో ఆడడం చాలా కష్టమని, కానీ నన్ను నేను ముందుకు తెచ్చుకోమని, నాపై నేను నమ్మకం ఉంచుకోమని చెప్పారు. నేను 2013 నుంచి యూపీ తరఫున నంబర్ 5 లేదా 6లో ఆడుతున్నాను. కాబట్టి నేను ఆ స్థానానికి అలవాటుపడ్డాను. 4, 5 వికెట్లు పతనమైతే ఆ స్థానంలో ఆడడం చాలా కష్టం. కాబట్టి ఆ స్థానంలో ఆడేందుకు నాకు మద్దతిస్తున్నారు. ఆ సమయంలో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాలి. కాబట్టి నాకు నేను చెప్పుకుంటాను. ఎక్కువ ప్రశాంతంగా ఉండగలను. అది నాకు మంచి చేస్తుంది’’ అని చెప్పాడు.

Updated Date - 2023-12-10T13:57:15+05:30 IST