India Vs Australia: రోహిత్ శర్మ సెంచరీ.. ఇండియన్ క్రికెటర్లలో రోహిత్‌కే సాధ్యమైన రికార్డ్ ఇదీ

ABN , First Publish Date - 2023-02-10T14:03:10+05:30 IST

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Australia 1st test) తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ (Rohit Sharma century) బాదాడు.

India Vs Australia: రోహిత్ శర్మ సెంచరీ.. ఇండియన్ క్రికెటర్లలో రోహిత్‌కే సాధ్యమైన రికార్డ్ ఇదీ

నాగ్‌పూర్: నాగ్‌పూర్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Australia 1st test) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ (Rohit Sharma century) బాదాడు. 180కిపైగా బంతులు ఎదుర్కొన్న రోహిత్ ప్రస్తుతం 116 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్‌పై నమోదు చేసిన తాజా సెంచరీతో రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల సరసన రోహిత్ చేరాడు. తనకంటే ముందు ఈ ఫీట్ సాధించినవారి జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుప్లెసిస్, పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఉన్నారు. వీరందరూ కెప్టెన్లుగా అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు బాదారు. రోహిత్ కంటే ముందు భారతీయ క్రికెటర్లు ఎవరూ ఈ రికార్డును సాధించలేకపోయారు. కాగా చాలా గ్యాప్ తర్వాత రోహిత్ బ్యాట్ నుంచి శతకం వచ్చింది. గత కొంతకాలంగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్నప్పటికీ సెంచరీలుగా మలచడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

కాగా ప్రస్తుతం 77 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 219 పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (116), రవీంద్ర జడేజా (29) ఆడుతున్నారు. భారత్ 42 పరుగుల లీడింగ్‌లో ఉంది.

Updated Date - 2023-02-10T14:10:56+05:30 IST