Share News

Hyd Fire Accident: 9మంది మృతి అత్యంత బాధాకరం.. అగ్నిప్రమాదంపై భట్టి

ABN , First Publish Date - 2023-11-13T13:42:43+05:30 IST

నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Hyd Fire Accident: 9మంది మృతి అత్యంత బాధాకరం.. అగ్నిప్రమాదంపై భట్టి

హైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై (Nampally Fire Accident) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Batthi Vikramarka) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాంపల్లి బజార్ ఘాట్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే నాంపల్లి అగ్నిప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌ను (Congress Candidate Feroz Khan) ఎంఐఎం (MIM) కార్యకర్తలు అడ్డుకోవడాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2023-11-13T13:42:44+05:30 IST