Dasoju Shravan: రేవంత్రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ బంధీ కావడం సిగ్గుచేటు
ABN , First Publish Date - 2023-10-11T21:30:23+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) చేతిలో కాంగ్రెస్ పార్టీ బంధీ కావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ (Dasoju Shravan) అన్నారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) చేతిలో కాంగ్రెస్ పార్టీ బంధీ కావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్(Dasoju Shravan) అన్నారు. బుధవారం నాడు తెంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ రేవంత్ పట్ల జాగ్రత్తగా లేకపోతే తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పతనాన్ని చూస్తే జాలేస్తుంది. ఒకప్పుడు సిద్ధాంతాలకు ప్రజా సంక్షేమానికి కట్టుబడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేడు రాజకీయాలను వ్యాపారంగా, డబ్బు సంపాదనకు సులువైన మార్గంగా భావించే రేవంత్రెడ్డి చేతిలో బంధీ అయింది. రేవంత్రెడ్డి పార్టీ టికెట్లను అమ్ముకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరం. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుని తమ సొంత పార్టీ అభ్యర్థులనే దోచుకుంటున్నకాంగ్రెస్ నాయకులు, పొరపాటున అధికారంలోకి వస్తే, తెలంగాణకు ఎదురయ్యే దుష్పరిణామాలను తలుచుకుంటేనే భయమేస్తోంది’’ అని దాసోజు శ్రావణ్ పేర్కొన్నారు.