TS NEWS: ఆ నేతపై బీజేపీ వేటు.. కారణమేంటంటే..?
ABN , First Publish Date - 2023-09-03T23:47:30+05:30 IST
బీజేపీ(BJP)లో వరుసగా సస్పెన్షన్లు(Suspensions) చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy)సస్పెన్షన్‌కు గురయ్యారు.
హైదరాబాద్: బీజేపీ(BJP)లో వరుసగా సస్పెన్షన్లు(Suspensions) చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy)సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుంచి బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని (Jitta Balakrishna Reddy) బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వరుస సస్పెన్షన్లపై తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతోంది. గతేడాది గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)పై బీజేపీ జాతీయ నాయకత్వం వేటు వేసింది. సస్పెన్షన్లతో పార్టీ క్యాడర్‌లో తీవ్ర నిరాశ నెలకొంటుంది. బండి సంజయ్ అధ్యక్ష మార్పుతో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు అసంతృష్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సస్పెన్షన్లతో పార్టీ క్యాడర్ డైలామాలో పడిపోతుంది. కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరిపై బీజేపీ అధిష్ఠానం వేటు వేసింది.