Share News

Karimnagar :ఏకంగా కలెక్టర్‌ నివాసంలో చోరీ చేశాడు..

ABN , First Publish Date - 2023-11-01T15:04:41+05:30 IST

ఏకంగా జిల్లా కలెక్టర్ నివాసంలోనే ఓ దొంగ చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ కలెక్టర్ నివాసంలో ఈ చోరీ జరిగింది.

Karimnagar :ఏకంగా కలెక్టర్‌ నివాసంలో చోరీ చేశాడు..

కరీంనగర్ : ఏకంగా జిల్లా కలెక్టర్ నివాసంలోనే ఓ దొంగ చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ కలెక్టర్ నివాసంలో ఈ చోరీ జరిగింది. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ గోపిపై ఈసీ బదిలీ వేటు వేసింది. అయితే తాజాగా గోపి నివాసంలో చొరబడిన దొంగ.. ల్యాప్‌టాప్ సహా సర్టిఫికేట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని విలువైన వస్తువులను చోరీ చేశాడు. ఆ చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-11-01T15:04:41+05:30 IST