MLC Kavitha: కవితను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ లీకులు

ABN , First Publish Date - 2023-03-11T19:23:03+05:30 IST

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ లీకులు బయటకు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర టెన్షన్‌ వాతావరణ నెలకొంది.

MLC Kavitha: కవితను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ లీకులు

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ లీకులు బయటకు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర టెన్షన్‌ వాతావరణ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో 8 గంటలుగా ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ (BRS) నేతలను ఈడీ ఆఫీస్‌ నుంచి పోలీసులు బయటకు పంపిస్తున్నారు. దీంతో కవితను అరెస్ట్ చేసే అవకాశముందనే అనుమానాలు బలపడుతున్నాయి. కవిత ఈడీ విచారణపై ప్రగతిభవన్‌ (Pragati Bhavan) నుంచి సీఎం కేసీఆర్ (CM KCR) ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్‌ మంత్రులు (BRS Ministers), ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకున్నారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఈడీ ఆఫీస్ ఎదుట మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టనున్నారు. కవితను అరెస్ట్ చేస్తే.. అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఆప్ సహా విపక్ష నేతల మద్దతుతో నిరసనలకు బీఆర్‌ఎస్ ప్లాన్ (BRS Plan) చేస్తోంది.

రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలోనూ కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. కవితను అరెస్టు చేస్తే.. బీఆర్‌ఎస్‌ పరంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను కూడా ఈ భేటీలో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారని, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పార్టీశ్రేణులను అప్రమత్తం చేయడంపై మంత్రులకు పలు సూచనలు చేశారని సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ ఉద్యమించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారని చెబుతున్నారు. అలాగే.. ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై బీజేపీ ధోరణి ఎలా ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ ఆదేశించించినట్లు సమాచారం.

Updated Date - 2023-03-11T19:27:29+05:30 IST