Sharmila: ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జాకోరు: షర్మిల
ABN , First Publish Date - 2023-02-19T17:12:03+05:30 IST
ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Shankar Naik) కబ్జాకోరని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శంకర్‌నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని
హైదరాబాద్: ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Shankar Naik) కబ్జాకోరని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శంకర్‌నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని, ఓ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పదమేనా? అని ప్రశ్నించారు. వాళ్లంటే తప్పులేదా? మేమంటేనే తప్పా?.. మహిళలు అంటే అంత చిన్నచూపా?.. ఆడవాళ్లు అయితే ప్రశ్నించకూడదా? అని షర్మిల ప్రశ్నించారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా నెళ్ళికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మాటలతో ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే.
షర్మిల అరెస్ట్
మహబూబాబాద్ సమీపంలో బేతోలులో దగ్గర షర్మిల (Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.