Vemula Viresham: బీఆర్ఎస్‌కు బిగ్ ఝలక్.. పార్టీ మారనున్న ఆ కీలక నేత.. ఎవరంటే..?
ABN , First Publish Date - 2023-09-22T17:38:48+05:30 IST
కొన్ని రోజులుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Viresham) బీఆర్ఎస్ పార్టీ(BRS party)లో అసంతృప్తిగా ఉన్నారు.
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ(BRS party)పై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Viresham)అసంతృప్తిగా ఉన్నారు. పలుమార్లు సీఎం కేసీఆర్(CM KCR)ని కలవడానికి అనుమతి ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరేందుకు పచ్చజెండా ఊపారు. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వీరేశంను కలిసి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ రోజు వేముల వీరేశం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సీట్లలో తనకు టికెట్ కేటాయిస్తారని వేముల వీరేశం భావించారు. కానీ గులాబీ బాస్ ఆయనకు మొండి చేయి చూపించారు. పార్టీ మారితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన వేముల వీరేశం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు లేదా రేపు ఉదయం వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలతో వేముల వీరేశం ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈరోజు 7:30 గంటలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.