TS News: సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదు..: ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2023-01-22T16:44:09+05:30 IST
సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదని.. విద్యుత్ ఉత్పత్తి కూడా మనమే చేయొచ్చు అని నిరూపిస్తున్న ఘనత తెలంగాణదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదని.. విద్యుత్ ఉత్పత్తి కూడా మనమే చేయొచ్చు అని నిరూపిస్తున్న ఘనత తెలంగాణదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రయివేటు పరం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ (Telangana)లో సింగరేణిని కాపాడుకుంటామన్నారు. నాయకుడికి విల్ పవర్.. దక్షత ఉండాలని, అవన్నీ ఉన్న నాయకుడు కేసీఆర్ (KCR) అని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలు అడ్డుకున్న వారు ఎవరో కార్మికలోకం ప్రజలకు తెలిపాలన్నారు. తెలంగాణలో సింగరేణి కార్మికులకు వస్తున్న బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సింగరేణి కార్మికులను సోషల్ మీడియా ద్వారా చైతన్యం చేయాలని ఆమె అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పొందిన 18 వేల మంది యువకులు బాధ్యతగా భావించాలని ఆమె సూచించారు. బీజేపీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అమ్మకాల కోసం సిగ్గులేకుండా ఓ మినిస్ట్రీని పెట్టారని విమర్శించారు. ఆ మినిస్ట్రీకి దీపం అనే పేరు పెట్టి నిరుద్యోగుల జీవితాల్లో చీకటి నింపుతున్నారని చెప్పారు.