Share News

Good News: ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:42 PM

నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు విలవిల్లాడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించింది.

Good News: ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం

అమరావతి: నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు విలవిల్లాడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన చేశారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో ధర రూ.160గా ఉండగా దానిని రూ.150కి తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఇక బియ్యం ధరను రూ.48 నుంచి రూ.47కి స్వల్పంగా తగ్గిస్తు్న్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.


తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నామని, గురువారం నుంచి విక్రయిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించామని నాదెండ్ల మనోహర్ వివరించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఆయన ప్రస్తావించారు.


కాగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ధరల స్థిరీకరణపై దృష్టిసారించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరల తగ్గింపుపై దృష్టిసారించారు. ఇటీవలే వ్యాపారులతో మంత్రి సమావేశమయ్యారు. బియ్యం, కందిపప్పు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. బ్లాక్‌ మార్కెట్‌ వంటి చర్యలకు పాల్పడవద్దని, సామాన్య జనాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.


ధరల స్థిరీకరణలో భాగంగా ఇటీవల కూడా బియ్యం, కందిపప్పు ధరలను స్వల్పంగా తగ్గించారు. ఈ నెల 11 నుంచి రైతు బజార్లలో కిలో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.180 ఉండగా రూ.160కి, స్టీమ్డ్‌ రైస్‌‌ కేజీ రూ.55.85 నుంచి రూ.49కి, ముడి బియ్యం కేజీ రూ.52.40 నుంచి రూ.48కి తగ్గించారు.

ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

టీడీపీలోకి కుప్పం వైసీపీ నేతలు

For more AP News and Telugu News

Updated Date - Jul 31 , 2024 | 04:45 PM