Liquor Lovers: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..
ABN , Publish Date - Apr 22 , 2024 | 09:47 AM
మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?
హనుమాన్ జయంతిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీనికోసం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాలను ఓపెన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా పర్వదినాలు, పండుగల సమయంలో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా త్వరలో లోక్ సభ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు, మత ఘర్షణలకు తావు ఇవ్వకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
AP News: సుచరిత అనుచరుల అరాచకాలపై డిల్లీలో వేలు కట్ చేసుకుని మరీ మహిళ నిరసన
Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం..