Share News

Andhra Pradesh: వైసీపీ ముఖ్య నేతకు బీజేపీ లీడర్ సీరియస్ వార్నింగ్..

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:31 AM

ఏపీలో పాలిటిక్స్(AP Politics) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇదే అంశంలో.. మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Andhra Pradesh: వైసీపీ ముఖ్య నేతకు బీజేపీ లీడర్ సీరియస్ వార్నింగ్..

తిరుపతి, ఏప్రిల్ 05: ఏపీలో పాలిటిక్స్(AP Politics) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇదే అంశంలో.. మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదే అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి(Bhanu Prakash Reddy).. తమ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై పేర్ని నాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది సరికాదని వార్నింగ్ ఇచ్చారు. పేర్ని నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకు?

ABN ఛానల్ ఫాలో అవ్వండి

‘నోరు అదుపులో పెట్టుకో నాని.. అన్నం తింటున్నావా? మరేమైనా తింటున్నావా?’ అంటూ నానిపై బీజేపీ నాయకుడు కన్నెర్ర చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్‌లను ఇండియన్ పొలిటికల్ సర్వీస్‌లుగా మార్చేసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. నాని మాటలు చూస్తుంటే.. అధికారులను నమ్ముకుని ఎన్నికల్లోకి పోవాలని అనుకుంటున్నట్లు ఇట్టే తెలిసిపోతుందన్నారు. వైసీపీ నేతలు తమ ఓటమిని ముందే అంగీకరించినట్లు అర్థమవుతోందన్నారు ప్రకాష్ రెడ్డి.


ఇవి కూడా చదవండి:

జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

అలా చేస్తే నా ఎంపీ పదవి పోతుంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 11:31 AM