Share News

CM Chandrababu: మినిట్ టు మినిట్ ఏం జరిగింది?.. మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:49 AM

Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.

CM Chandrababu: మినిట్ టు మినిట్ ఏం జరిగింది?.. మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, జూలై 22: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాద (Fire Accident) ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నాడు సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్, 22 ఏ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు అయినట్లు తెలుస్తోంది.

Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు


ఈ క్రమంలో ఘటనపై జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 11:24 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీఎంకు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అతను ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే వివరాలను చంద్రబాబు అడిగారు. ఘటనా సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నాడని అధికారులు వివరించారు.

US Elections 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా.. ఆమె జీవిత విశేషాలివే


ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారు అని అధికారులను చంద్రబాబు నాయుడు అడిగారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం తెలిపారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మరిపోకూడదని... ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లై‌తో కంగుతిన్న నేతలు..!

Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 11:51 AM