Former Minister Roja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రోజా..
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:12 PM
ఆంధ్రప్రదేశ్‌లో వరస అత్యాచార, హత్యాచార ఘటనలపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అత్యాచార ఘటనలు నిర్మూలించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు నిర్మూలించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా (Roja) అన్నారు. ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , హోంమంత్రి అనిత (Anitha) ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 120 రోజుల్లో ఇలాంటి ఘటనలు 110 జరిగాయని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని, మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు.
పవన్ ఏం చేశారు?
ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. " ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరగకుండా చూడడంలో హోంమంత్రి అనిత సరిగా పనిచేయడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనడం వెనక కారణం ఏంటి?. దళితవర్గానికి చెందిన హోంమంత్రిపై నిందలు వేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా?. పిఠాపురం నియోజకవర్గంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినప్పుడు పవన్ ఎక్కడి వెళ్లారు. చిన్నారిపై అఘాయిత్యం జరిగితే కనీసం బాధిత కుటుంబాన్ని పవన్ పరామర్శించలేదు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి లాగా పనిచేయాలని ఆయన చెబుతున్నారు. యోగిలా పనిచేయమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ చెప్పాలి. అధికారం చేతిలో ఉన్న వాళ్లు తప్పులు జరగకుండా చూడాలి. కానీ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి తమ విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తిరుపతి ఘటనలోనూ నిజాన్ని కప్పిపుచ్చేందుకు బాలికను పరీక్షల పేరుతో అనేక ఆస్పత్రులకు తిప్పడం నిజం కాదా?. ప్రభుత్వం నుంచి తిరుపతి ఎస్పీకి ఎంత ఒత్తిడి వస్తుందో ఆయన మాటలు బట్టే అర్థం అవుతోంది.
నచ్చని వారిపై రెడ్ బుక్..
డీజీపీ నుంచి కిందస్థాయి సిబ్బంది వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి లోకేశ్ బదిలీలు చేసుకున్నారు. నచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చుకుని ఇప్పుడు లైంగిక దాడులకు పాల్పడే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే లోకేశ్ విదేశాల్లో తిరుగుతున్నాడు. ఆయనకి ఎవరు నచ్చలేదో వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం రుద్దుతారు. గుడ్లవల్లేరులో మాన, ప్రాణాలు పోయేలా విద్యార్థినిల వీడియోలు తీస్తే వారిని బెదిరించి విషయాన్ని కప్పిపుచ్చారు. ఈ ఘటనలో విద్యాశాఖ మంత్రి పూర్తిగా విఫలం అయ్యారు. కాలేజీల్లో అమ్మాయిలపై దాడులు జరుగుతుంటే విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?.
రాష్ట్రపతి పాలన..
తిరుపతి వాసవీ నగర్‌లోనూ యువతిపై దాడి జరిగింది. రిషికొండ ఎక్కడికీ పోదు.. అక్కడే ఉంటుంది. ఇక్కడ మహిళలపై జరుగుతున్న దాడుల్ని చూడండి. మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి. ప్రధాని మోదీని వేడుకుంటున్నా. మీరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలను చూసి రాష్ట్రపతి పాలన విధించాలి. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నారు. కనీసం బాధితులను పరామర్శించలేదు. ఈవీఎంలు మ్యానేజ్ చేసి గెలిచిన పరిపాలన ఇలానే ఉంటుంది. డమ్మీ హోంమంత్రిని పెడితే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. వైసీపీ అధినేత జగన్ తిరుపతికి వస్తున్నారన్న సమాచారంతో బాధితులను బెదిరించి వారితో మాట్లాడిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..
Read Latest AP News And Telugu News