Anam RamnarayanaReddy: టీటీడీ పాలకమండలి నియామకం ఎప్పుడో చెప్పిన మంత్రి
ABN , Publish Date - Sep 24 , 2024 | 01:30 PM
Andhrapradesh: టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. లడ్డు వివాదం ముగిసిన అంశం అని.. తదుపరి సిట్ దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
తిరుమల, సెప్టెంబర్ 24: త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramnarayana Reddy) వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు.
RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్
లడ్డు వివాదం ముగిసిన అంశం అని.. తదుపరి సిట్ దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తిరుమల ఆలయంతో పాటు రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల్లో నిన్నే (సోమవారం) శాంతి హోమం, సంప్రోక్షణ కార్యాక్రమాలను నిర్వహించామన్నారు.
రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా శాంతి హోమం, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించామని అన్నారు. నాణ్యమైన ముడిసరుకులతో శ్రీవారికి ప్రసాదాలు సమర్పించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను పరిశీలించి.. నాణ్యతని పరిశీలించాకే వినియోగించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర, కన్యాకా పరమేశ్వరి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
HYDRA: బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం
ఈరోజు సాయంత్రానికి జీవో..
కాగా.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం లోపు అందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. కాసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్హ, ఐజీ లా అండ్ ఆర్డర్ శ్రీకాంత్, ఏపీఎస్ప్ డీఐజీబీ.రాజా కుమారిలతో సమావేశమయ్యారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై సిట్ ఏర్పాటు , అనంతపురం లో రథం దగ్ధం, తాజా శాంతి భద్రతల అంశాలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో సిట్‌లో ఎవరెవరు ఉండనున్నరో వెల్లడిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇదే అంశంపై సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా సమావేశమై చర్చించారు.
ఇవి కూడా చదవండి..
Buddha Venkanna: ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలి
Narayana: కల్తీ నెయ్యికి ప్రధాన కారకుడు జగనే..
Read Latest AP News And Telugu News